తాత్కాలికంగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

| Edited By:

Jul 31, 2019 | 10:14 PM

జమ్ముకశ్మీర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు చోట్ల రవాణా స్థంభించిపోయింది. ఈ నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆగస్టు 4 వరకు యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రానున్న కొద్ది రోజులపాటు.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసేశారు.

తాత్కాలికంగా అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
Follow us on