‘తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం’.. ర‌క్ష‌ణ కావాలంటూ పిటిష‌న్ వేసిన మహిళ‌కు కోర్టు ఫైన్

|

Jun 18, 2021 | 7:29 AM

తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోన్న‌ ఒక మహిళకు రక్షణ కల్పించడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. ఇది హిందూ....

తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం.. ర‌క్ష‌ణ కావాలంటూ పిటిష‌న్ వేసిన మహిళ‌కు కోర్టు ఫైన్
Uniform Civil Code
Follow us on

తన భర్తను విడిచిపెట్టి, వేరే వ్య‌క్తితో స‌హ‌జీవ‌నం చేస్తోన్న‌ ఒక మహిళకు రక్షణ కల్పించడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. ఇది హిందూ వివాహ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. తాము సహజీవనం చేస్తున్నామని, కుటుంబ సభ్యులు త‌మ‌పై దాడి చేయకుండా రక్షించాలని కోరుతూ ఓ వివాహిత, ఆమె ప్రియుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం న్యాయమూర్తులు కౌషల్ జయేంద్ర థాకర్, దినేష్ పాథక్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలో భర్తగానీ, ఇతరులుగానీ ఇబ్బందులు కలిగించకుండా చూడాలని పిటిషనర్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం వారికి రూ.5000 ఫైన్ వేసింది.  రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని, కానీ అది చట్టానికి లోబ‌డి ఉండాలని వ్యాఖ్యానించింది. సమాజంలో చట్టవ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి పిటిషన్‌ను ఎలా అంగీకరించగలమని ప్రశ్నించింది.

భర్త నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే… ముందుగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని పేర్కొంది. కానీ అలా జరగలేదని తెలిపింది. జీవితానికి, స్వేచ్ఛకు రక్షణ కల్పించాలన్న పేరుతో వివాహేతర సహజీవనానికి అనుమతించలేమని కోర్టు తేల్చి చెప్పింది.

Also Read:  ఒకేసారి ఇద్దరినీ ప్రేమించాడు.. ఒకేసారి ఇద్ద‌రినీ పెళ్లాడాడు..

 కరోనా టీకాలు, అపోహలు –వాస్తవాలు.. పూర్తి వివ‌రాలు