Uttarakhand Tapovan dam news: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని అలకనందా నది మరోమారు ఉప్పొంగింది. ఈ హఠాత్ పరిణామంతో అధికారులు ఒక్కసారిగా టెన్షన్‌కు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా తపోవన్ టన్నెల్ వద్ద సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు ఉత్తరాఖండ్ వరద బీభత్సం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకాలు ఎక్కువవుతున్నాయి. వరదలో గల్లంతై.. తపోవన్ సొరంగంలో చిక్కుకున్నట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు చేపట్టిన డ్రిల్లింగ్ ఆపరేషన్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. తవ్వకాలు జరిపే మెషీన్ చెడిపోవడం వల్ల తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. కాగా సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని తప్పిపోయిన కార్మికుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తమ ఆత్మీయుల కోసం పడిగాపులు గాస్తున్నారు.
కాగా వరద ప్రకంపనల కారణంగా ఇప్పటి వరకు 35 మంది మరణించగా.. 204 మంది గల్లంతయ్యారని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. చమోలీ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య పర్యటించారు.
Also Read: