Assam MLA Akhil Gogoi: అస్సాంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైలు నుంచే ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందిన సామాజిక కార్యకర్త, రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగోయ్ ఎట్టకేలకు విడుదలయ్యారు. 2019 డిసెంబర్‌లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో గొగోయ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అరెస్టయ్యారు. అస్సాంలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు కారణం గొగోయ్ అంటూ.. పోలీసులు యూఏపీఏ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ అతడిపై నమోదైన అభియోగాలను ఎన్‌ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో దాదాపు 19 నెలల తర్వాత జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు.
విడుదల అనంతరం అఖిల్ గొగోయ్ మీడియాతో మాట్లాడారు. ఎట్టకేలకు సత్యం గెలిచిందని పేర్కొన్నారు. తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయని.. చివరకు న్యాయమే గెలిచిందన్నారు. తాను జైల్లో ఉన్నా.. తనను గెలిపిచిన శివసాగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు నియోజకవర్గమంతా పర్యటిస్తానని వెల్లడించారు. తనను జైల్లో ఉంచడానికి ప్రయోగించిన ‘ఉపా’ చట్టంపై మున్ముందు తన పోరు కొనసాగుతుందని అఖిల్ గొగోయ్ స్పష్టంచేశారు.
తన డబ్బు లేదని.. దేశద్రోహిగా, ఉగ్రవాదిగా ప్రభుత్వం ముద్రవేసిందని గొగోయ్ పేర్కొన్నారు. కానీ.. శివసాగర్ ప్రజలు స్వేచ్ఛా సంకల్పం కోసం విరాళాలిచ్చారని తెలిపారు. తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న శివసాగర్ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అని అఖిల్ తెలిపారు.
Also Read: