వంటనూనెతో నింగిలోకి ఎగిరిన విమానం.. బయోడీజిల్‌తో చేసిన ప్రయోగం విజయవంతం..

ప్రస్తుతం దేశంలో వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉక్రెయిన్.. రష్యా యుద్ధం కారణంగా రోజు రోజూకీ వంటనూనె ధరలు

వంటనూనెతో నింగిలోకి ఎగిరిన విమానం.. బయోడీజిల్‌తో చేసిన ప్రయోగం విజయవంతం..
Airbus
Follow us
Rajitha Chanti

| Edited By: Srinivas Chekkilla

Updated on: Apr 04, 2022 | 3:10 PM

ప్రస్తుతం దేశంలో వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉక్రెయిన్.. రష్యా యుద్ధం కారణంగా రోజు రోజూకీ వంటనూనె ధరలు మరింత పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్యాసింజర్‌ విమానం జెట్‌ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. సూపర్‌ జంబో విమానం ఎయిర్‌బస్‌ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్‌ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంటుకు సుమారు రూ. 2,280 కోట్లు ఖర్చు అవుతుంది. గతేడాదిలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్ నెలలో ఏ319 నియో విమానాలు ఇలా ఎఫ్ఏఎఫ్‏తో ఎగిరాయి. కానీ ప్రయాణికులతో వంటనూనె విమానాన్ని నడపడం ఇదే మొదటి సారి.

మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్‌ చేసి బయోడీజిల్‌గా మారుస్తారు. ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి. విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70 ఫారన్‌హీట్‌ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్‌ తదితరాలను జతచేస్తారు.

Also Read: Yami Gautam: హ్యాక్‌కు గురైన నటి యామీ గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌.. అప్రమత్తంగా ఉండండి అంటూ..

Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

Piyush Goyal: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ధన్యవాదాలు తెలిపిన మూవీ యూనిట్‌..