Air Pollution: డేంజర్ బెల్స్.. క్షీణిస్తోన్న గాలి నాణ్యత.. ఆరోగ్యవంతులకు కూడా క్యాన్సర్ సహా అనేక వ్యాధులు !

|

Nov 06, 2023 | 9:58 AM

వాయు కాలుష్యం శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది. కాలుష్యం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. వాయు కాలుష్యాన్ని వివిధ రకాల క్యాన్సర్‌లకు అనుసంధానించే శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. వాయుకాలుష్యం పుట్టబోయే బిడ్డపై కూడా దుష్ప్రభావం చూపుతుందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

Air Pollution: డేంజర్ బెల్స్.. క్షీణిస్తోన్న గాలి నాణ్యత.. ఆరోగ్యవంతులకు కూడా క్యాన్సర్ సహా అనేక వ్యాధులు !
Air Pollution
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు క్షీణిస్తోంది. శీతాకాలం ప్రారంభంలోనే గాలి మరోసారి విషపూరితమైనది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత వరుసగా మూడు రోజూ భయాన్ని కలిగిస్తోంది.  ఆదివారం మధ్యాహ్నం నుంచి తీవ్రరూపం దాల్చింది. ఈ వాయు కాలుష్యం వల్ల అక్కడ నివసిస్తున్నవారు రకరకాల శారీరక వ్యాధులు బారినపడుతున్నారు. ముఖ్యంగా, కళ్ళు, ముక్కు సంబంధింత సమస్యలతో పాటు,  శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న అధిక కాలుష్యం కారణంగా మొత్తం శరీరం ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితిపై వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం శీతాకాలం ప్రారంభం మాత్రమే.. డిసెంబర్ – జనవరిలో శీతాకాల సమయంలో కాలుష్యం స్థాయి మరింత పెరుగుతుంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించడంతో ఈ ప్రభావం.. ఆరోగ్యంపై పడుతుందని వైద్యులు, ఆరోగ్య నిపుణులు వాయు కాలుష్యతో ఎదుర్కోనున్న ప్రమాదకర స్థితిని వివరించారు. ముఖ్యంగా ఈ కాలుష్యం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆదివారం రోజున వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఢిల్లీలోని AIIMSలోని మెడిసిన్ విభాగంలో డాక్టర్,  ప్రొఫెసర్ డాక్టర్ పీయూష్ రంజన్ మాట్లాడుతూ.. “వాయు కాలుష్యానికి ఆరోగ్యానికి అనేక సంబంధాలు ఉన్నాయని వెల్లదించారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. కాలుష్యం వల్ల శ్వాసకోశ సమస్యలే కాకుండా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ , ఆర్థరైటిస్ వంటి కొరోనరీ ఆర్టరీ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

వాయు కాలుష్యం శరీరంలోని వివిధ భాగాలపై ప్రభావం చూపుతుంది. కాలుష్యం వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది. వాయు కాలుష్యాన్ని వివిధ రకాల క్యాన్సర్‌లకు అనుసంధానించే శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

వాయుకాలుష్యం పుట్టబోయే బిడ్డపై కూడా దుష్ప్రభావం చూపుతుందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. గర్భధారణ సమయంలో సంక్లిష్టమైన శారీరక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా వాయు కాలుష్యం మెదడు, గుండె పని తీరుని దెబ్బతీస్తుంది. సరైన రక్షణ చర్యలు పాటించక పొతే ఆరోగ్యం ఆందోళనకరంగా మారవచ్చు అని ఈ వాయు కాలుష్య ప్రభావం అన్ని వయసుల ప్రజలలో సంభవించవచ్చని వెల్లడించారు.

గాలి నాణ్యత 50 లోపు ఉండాల్సిన చోట 400 దాటిందని వైద్యులు తెలిపారు. దీంతో ఎంతటి ఆరోగ్యకరమైన వ్యక్తిలోనైనా శ్వాస సమస్యలు, ఉబ్బసం వంటి సమస్యలు ఏర్పడతాయి. పిల్లలు, వృద్ధులు కూడా దృష్టి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారకంగా మారవచ్చు అని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..