
గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిర్‌ఇండియా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషం వ్యవధిలోనే ఓ బిల్డింగ్‌పై కూప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మంది కూడా మృతి చెందారు. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది అంతా మరణించారు.
వీరితో పాటు విమానం కూలిన బిల్డింగ్‌లో ఉన్న మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో నల్లరంగు డీపీలను అప్‌డేట్ చేసింది. ఎక్స్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బ్లాక్ కలర్ డీపీలను పెట్టింది ఎయిర్ ఇండియా. 1985 తర్వాత ఎయిర్‌ఇండియా విమానయాన సంస్థకు సంబంధించి ఇదే అతిపెద్ద క్రాష్. ప్రమాదానికి ముందు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ ఏటీసీ టవర్‌కు మేడే కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.
@airindia pic.twitter.com/Qek7jfL0hz
— Sayyad Nag Pasha (@nag_pasha) June 12, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..