Kochi airport: కొచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ.. ! విమానం ల్యాండ్ అవుతుండగా అనుకోని ఘటన..

ఆ విమానంలో 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని, విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు..

Kochi airport: కొచ్చి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ.. ! విమానం ల్యాండ్ అవుతుండగా అనుకోని ఘటన..
Air Arabia Flight

Updated on: Jul 16, 2022 | 11:37 AM

Kochi airport: కొచ్చి విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం… యూఏఈలోని షార్జా నుంచి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా హైడ్రాలిక్ వైఫల్యం చెందింది. దీంతో ఆ విమానాన్ని పైలట్ సూరక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ విమానంలో 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారని, విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది.

జాతీయ, అంతర్జాతీయ, విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్‌ అవుతున్న ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.. ఢిల్లీ నుంచి వడోదర వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లో క్షణకాలంపాటు ప్రకంపనలు వ‌చ్చాయి. దాంతో జైపూర్ లో ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి