తమిళనాడులో పోటీ చేస్తాం… దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో నిలుస్తాం.. గెలుస్తాం… ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ

|

Nov 25, 2020 | 8:19 PM

ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని, బలాన్ని పెంచుకుంటోంది.

తమిళనాడులో పోటీ చేస్తాం... దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో నిలుస్తాం.. గెలుస్తాం... ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ
Follow us on

ఒకప్పుడు హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన రాజకీయ ప్రాబల్యాన్ని, బలాన్ని పెంచుకుంటోంది. బీహార్ ఎన్నికల్లో 5 సీట్లు సాధించి మంచి ఊపు మీద ఉన్న ఆ పార్టీ వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో సైతం పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ తాజాగా ప్రకటించారు. కాగా, ఎంఐఎం పార్టీ గతంలో తెలంగాణలోని హైదరాబాద్ వరకే పరిమితమై ఉండేది. మొదటి సారిగా మహారాష్ర్టలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందింది. అయితే ఆ రెండు స్థానాలు కూడా ముస్లీంలు అధికంగా ఉండే ప్రదేశాలే. అయితే అదే ఊపులో బీహార్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేసి అయిదు స్థానాల్లో గెలుపొందింది.

దేశ వ్యాప్తంగా పోటీ చేస్తాం…

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ… వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంచనాకు సైతం వచ్చామని అన్నారు. తమిళనాడులోనే కాకుండా పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ లో సైతం ఎంఐఎం ఎన్నికల బరిలో నిలువనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉండేందుకు కలిసి వచ్చే పార్టీలో పొత్తు పెట్టుకునేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

25-30 స్థానాల్లో పోటీ…

ఎంఐఎం పార్టీ తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ మాట్లాడుతూ… రాష్ర్టంలో 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా ఎంఐఎం గెలుపు అవకాశాలపై సర్వే సైతం నిర్వహించామని తెలిపారు. తమిళనాడులో ఎంఐఎం బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. తమిళనాడులోని మధురై, క్రిష్ణగిరి, వెల్లోరి, తిరుపట్టూరు నుంచి పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.