తమిళనాడులో అన్నాడీఎంకే..ప్రధాని నరేంద్ర మోదీకి బానిస పార్టీగా మారిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ పార్టీ ఇక ఏనాడూ జయలలిత పార్టీగా ఉండబోదని ఆయన అన్నారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే.. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఆయన ఈ విమర్శలు చేశారు. చెన్నైలో శనివారం మాట్లాడిన ఆయన.. దురదృష్టవశాత్తూ ఏఐ ఎడీఎంకే ఇలా మత తత్వ పార్టీతో జత కట్టిందన్నారు. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మమక్కల్ కళగంతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ఒవైసీ సమర్థించారు. డీఎంకేని కూడా ఆయన తప్పు పడుతూ కాంగ్రెస్ పార్టీతో ఇది పొత్తు కుదుర్చుకోవడంలోని సహేతుకతను ఆయన ప్రశ్నించారు. బాబ్రీ మసీదును శివసేన ‘త్యాగం’ చేసిందని మహారాష్ట్ర సీఎం, ఆ పార్టీ నేత ఉధ్ధవ్ థాక్రే తమ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశంసించారని, ఇందుకు గర్వ పడుతున్నానని వ్యాఖ్యానించారని, ఇప్పుడు డీఎంకె కూడా శివసేన వాదనను అంగీకరిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ ‘బీ’ టీమ్ గా తనను, దినకరన్ ను నిందిస్తున్నారని, అయితే అధికారంలోకి రావడానికి శివసేనకు తోడ్పడిన కాంగ్రెస్ పార్టీ తో డీఎంకే జత కడుతోందని ఒవైసీ ఆరోపించారు. అసలు డీఎంకే కి సెక్యులరిజం అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. శివసేనను ఈ పార్టీ సెక్యులర్ అని భావిస్తుందా లేక మత తత్వ పార్టీ అనుకుంటోందా అని అయన అన్నారు. తమిళనాట అమ్మ మక్కల్ కళగం తో పొత్తు పెట్టుకున్న ఎంఐఎం.. వణియంబాడి, కృష్ణ గిరి, శంకరపురం నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. ఈ రాష్టాల్లో ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని తెలిసినా తన రాజకీయ ప్రయోజనాలకోసం అన్నా డీఎంకే పొత్తు పెట్టుకోవడంలోని ఔచిత్యాన్ని ఒవైసీ మరీ మరీ ప్రశ్నించారు.
మరిన్ని చదవండి ఇక్కడ :
మద్యం మత్తులో పాముతో చెలగాటం ఆడిన ఒక యువకుడు …చివరికి ఏమైందంటే…!! ( వీడియో )
Kieron Pollard: పొలార్డ్ బౌలింగ్ గారడీ… చూస్తే వావ్ అనాల్సిందే..!! ( వీడియో )
Megastar Chiranjeevi: మన్మధుడు నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి… వీడియో