ఉత్తరప్రదేశ్ లో రూ. 50 కోట్ల వ్యయంతో డా.బీ.ఆర్. అంబేద్కర్ స్మారక మందిరాన్ని నిర్మించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. లక్నోలోని ఐషా బాగ్ లో దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం శంకు స్థాపన చేసే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందే రాష్ట్రంలో దళితులకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశంతో ఈ భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం శీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఈ మెమోరియల్ లో 45 మీటర్ల ఎత్తయిన అంబేద్కర్ శిలా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. రానున్న డిసెంబరు మొదటివారానికి ఇది [పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. డిసెంబరు 6 న అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈ శిలా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. లక్నో, నొయిడాలలో లోగడ బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి హయాంలో అంబేద్కర్ కి సంబంధించిన పలు మెమోరియల్స్ ను ఏర్పాటు చేశారు. కానీ వాటికీ భిన్నంగా ఈ మెమోరియల్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నూతన స్మారక మందిరంలో సాంస్కృతిక, విద్యా సంబంధమైన ఈవెంట్లు, కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఈ వర్గాలు పేర్కొన్నాయి.
20 అడుగుల ఎత్తున నిర్మించే పీఠికపై అంబేద్కర్ శిలా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారని తెలియవచ్చింది. గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా.. తాజాగా దీనికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యూపీలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ రాష్ట్రంలోని తన జన్మ స్థలాన్ని ఆయన విజిట్ చేయనున్నారు. ఈ సందర్బంగా ఆయన ఆదివారం రైల్లో ప్రయాణించడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి: యూకేలో మాజీ భార్యకు వాటా ఇవ్వాల్సివస్తుందని ఇల్లు తగులబెట్టుకున్నాడు… కోర్టు ఏ శిక్ష విధిస్తుందో..?