Karnataka Election: కాయ్ రాజా కాయ్.. ఒకటికి వంద.. గెలిచేది ఆ పార్టీనే.. కర్నాటక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌..

బెట్టింగ్ మార్కెట్‌ను నడుపుతున్న స్పెక్యులేటర్లు తమ డబ్బును కాంగ్రెస్‌పై పెట్టారు. కర్ణాటకలో బుధవారం 224 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ దాదాపు 120-130 సీట్లతో 'గణనీయ విజయం' సాధించగలదని అంచనాలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ (బిజెపి) గరిష్ఠంగా 80 సీట్లు గెలుస్తుందని, జనతాదళ్-సెక్యులర్ (జెడి-ఎస్)కి 37 సీట్లు వస్తాయని బుకీలు అంచనా వేశారు. దీంతో రహస్యంగా మార్కెట్లోకి..

Karnataka Election: కాయ్ రాజా కాయ్.. ఒకటికి వంద.. గెలిచేది ఆ పార్టీనే.. కర్నాటక ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌..
Karnataka Election

Updated on: May 12, 2023 | 1:08 PM

కర్నాటక ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ లోపే నరాలు తెగేంత ఉత్కంఠతో బెట్టింగ్‌లు మొదలయ్యాయి. పలానా నియోజకవర్గంలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ లేదా బీజేపీ గెలుస్తుందని పందెం కాస్తున్నట్లు , ఎవరైనా సవాల్‌ చేయవచ్చని బహిరంగంగానే వీడియోలు రిలీజ్‌ చేసి ఇతరులను ఆహ్వానిస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందే మైసూరులో ఎన్నికల ఫలితాలపై పలువురు బెట్టింగ్‌లు పెడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ డీ కోటే నియోజకవర్గంలో కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులపై 5 లక్షల రూపాయల బెట్టింగ్ బాండ్ పేపర్ పై ఇద్దరు వ్యక్తులు సంతకాలు చేశారు. జయరాం నాయక్ అనే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిపై పందెం వేశారు. దాన్ని సవాల్ చేస్తూ శివరాజ్ అనే వ్యక్తి జేడీఎస్ గెలుపుపై పందెం కాశారు. వీరిద్దరూ కూడా మధ్యవర్తిగా ఓ షాపు యజమాని ఖాతాలో 5 లక్షల నగదు జమ చేశారు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఇద్దరూ తమ డబ్బును వెనక్కి తీసుకోవాలని ఒప్పందంలో ఉంది.

ఇక కేఆర్‌ నగర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిపై బెట్టింగ్‌కు సిద్ధమైన వ్యక్తి తన చేతిలో 2 లక్షల నగదు పట్టుకొని బెట్టింగ్‌ కి ఆహ్వానిస్తున్న ఫొటో వైరల్‌ అవుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి రవికుమార్‌ గెలుస్తారని పందెం వేస్తున్నాని, కాదు జేడీఎస్‌ గెలుస్తుందని తనపై ఎవరైనా పందెం వేయవచ్చని బెట్టింగ్‌కి ఆహ్వానిస్తున్నారు.

మరోవైపు గుండ్లుపేట నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరైనా తమపై బెట్టింగ్‌కు సిద్ధంగా ఉంటే ఆహ్వానిస్తూ వీడియోలు విడుదల చేశారు. కాంగ్రెస్‌ గెలుపుపై మూడు ఎకరాల ఆస్తి, 75 లక్షల నగదు బెట్టింగ్ వేశారు. తనపై పందెం కాసి గెలిస్తే వారికి వీటితోపాటు బైక్‌, ఇన్నోవా కారు బహుమతిగా ఇస్తానని చెబుతున్న వీడియో వైరల్‌ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం