
Agnipath Protest Highlights: అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలను వ్యక్తమవుతున్న తరుణంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిన్న జరిగిన ఘటనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. రైల్వేస్టేషన్ కు భారీగా చేరుకున్న చేరిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లకు నిప్పంటించారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలోనే పోలీసులు ఫైరింగ్ చేయడంతో ఓ యువకుడు మరణించాడు. పోలీసులు పలుసార్లు నిరసనకారులతో చర్చలు జరిపే ప్రయత్నం చేయగా.. వారు ససేమిరా అనడంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు.
అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక సికింద్రాబాద్‌లోనూ బీభత్సం సృష్టించారు. ఈ దాడుల్లో పాల్గొన్న వారిలో 200 మందికిపైగా గుర్తించారు పోలీసులు. 52 మందిని అరెస్టు చేసి, మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసును కుట్రకోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.
నర్సంపేట డబీర్‌పేటలో రాకేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాకేష్‌ను చివరిసారి చూసేందుకు వేలాదిగా జనాలు తరలివచ్చారు. అంత్యక్రియల్లో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌లు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు రాకేష్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.
ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్‌లో ఆదివారం రోజంతా రైలు నడవదు. హింసాత్మక ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఏ రైలు నడవదు.
అగ్నిపథ్ స్కీమ్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం యువత గొంతు నొక్కేలా చేస్తుందని మండిపడ్డారు. యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని అన్నారు. ప్రభుత్వం కొత్త సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ విధానాన్ని ప్రకటించడం దురదృష్టకరం. ఇది పూర్తిగా దిక్కులేనిది, మీ గొంతులను విస్మరిస్తూ అలా చేసిందని యువతను ఉద్దేశించి హిందీలో ఒక ప్రకటనలో ఆమె అన్నారు.
I’m sad that govt ignored your voice & announced a new scheme that is completely directionless… I appeal to all of you to protest peacefully in a non-violent manner. Indian National Congress is with you: Congress chief Sonia Gandhi on #AgnipathRecruitmentScheme pic.twitter.com/BdwjtQeyUK
— ANI (@ANI) June 18, 2022
యువత వాయిస్ ను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్ పై యువత వాయిస్ ను పరిగణలోకి తీసుకోవాలన్నారు. కేంద్రం అగ్నిపథ్ ను తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్మీలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ, కొత్త ఉద్యోగాల నియామకంలో మూడేళ్లు జరుగుతున్న జాప్యంపై యువత మనోవేదనను తాను అర్థం చేసుకోగలనని అన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో 52 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ హింసాత్మక ఘటనలో 200 మందికిపైగా పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అల్లర్ల కేసును కుట్రకోణంలో విచారణ జరుపుతున్నారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా రైల్వేస్టేషన్‌లు రణరంగంగా మారాయి. ఆందోళనకారుల చేతి భారీ నష్టం వాటిల్లింది. ఇక ఇక నటి కంగనా రనౌత్ అగ్నిపథకానికి మద్దతు తెలిపారు. నటి సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ఆమె ప్రభుత్వాన్ని అభినందించింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో 52 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ హింసాత్మక ఘటనలో 200 మందికిపైగా పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల దృష్ట్యా పంజాబ్‌లోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ రైల్వే స్టేషన్‌లో రచ్చ జరగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర కల్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి హింసాకాండ జరగలేదన్నారు. రైళ్లు రద్దు చేయబడ్డాయని అన్నారు.
అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనల నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అగ్నిపథ్ స్కీమ్‌లో మార్పులు చేసింది. పూర్తి కథనం చదివేందుకు క్లిక్ చేయండి..
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో బీహార్ రైల్వే స్టేషన్‌కు రూ.200 కోట్ల నష్టం వాటిల్లినట్లు దానాపూర్ రైల్వే డివిజన్ డీఆర్‌ఎల్ ప్రభాత్ కుమార్ తెలిపారు. 50కి పైగా కోచ్‌లు దగ్ధమయ్యాయి. 5 ఇంజన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్లాట్‌ఫారమ్‌లు, కంప్యూటర్లు, ఇతర వస్తువుల వల్ల చాలా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. చాలా రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. పూర్తి కథనం చదవండి..
ఆర్మీ ఉద్యోగాలకు మంగళంపాడేందుకే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య , ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆక్షేపించారు. కేంద్రం తెచ్చిన ఈ అసంబద్ధ పథకం వల్లే దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయని అన్నారు. సికింద్రాబాద్ ఆందోళన వెనుక టిఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంటే, మరి బీహార్, ఉత్తరప్రదేశ్ లో జరిగిన అల్లర్ల వెనుక నితీష్ , యోగి ఆదిత్యనాథ్‌ల హస్తం ఉందా అని ప్రశ్నించారు.
విజయనగరం జిల్లాలో విషాదం నెలకొంది. కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడు మృతి చెందాడు. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో రైలు నిలిచిపోయింది. దీంతో గుండె ఆపరేషన్ నిమిత్తం విశాఖకు వెళ్తున్న జోగేష్ అనే వ్యక్తి రైలు నిలిచిపోవడంతో మరిణించాడు. కోర్బా ఎక్స్‌ప్రెస్ కొత్తవలసలో నిలిచిపోయింది. దీంతో ఆయనకు ఛాతినొప్పి ఎక్కువ కావడంతో జోగేష్ మృతి చెందాడు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రధాన సూత్రదారిని పోలీసులు అరెస్టు చేశారు. సుబ్బారావు అనేవ్యక్తిని ఏపీ పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ వ్యక్తి పల్నాడు జిల్లాలో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాడు. తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కాల్పులు జరిపిన గుంపును ప్రేరేపించడం వెనుక ఈ వ్యక్తి హస్తం ఉందని పోలీసులు భావిస్తున్నారు. విచారణ అనంతరం రైల్వే పోలీసులకు అప్పగించనున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన నేపథ్యంలో ఏపీ పోలీసులు అలర్ట్. ప్రధాన రైల్వే స్టేషన్‌లలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అల్లర్లకు చోటు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయి. రైళ్ల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. స్టేషన్‌లో ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నా
CAPF, అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఆర్మీలో అగ్నిపథ్ పథకం కింద ఎంపికైన యువతకు నాలుగేళ్లు పూర్తయిన తర్వాత CAPFలు, అసోం రైఫిల్స్‌లో 10 శాతం రిజర్వేషన్లను రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.
అగ్నిపథ్ నిరసన బీహార్‌లో బంద్ కొనసాగుతోంది. దీంతో పోలీసులు దాదాపు 100 రౌండ్ల కాల్పులు జరిపారు. బీహార్ బంద్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా పోలీసులు ఈ కాల్పలు జరిపారు. పాట్నాలోని మసౌధిలోని తారేగానా స్టేషన్ సమీపంలో భారీ రాళ్ల దాడి, కాల్పులు జరిగాయి.
అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పుడు ఈ విషయమై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ‘యువత గొంతును విస్మరించిన ప్రభుత్వం పూర్తిగా దిక్కులేని కొత్త పథకాన్ని ప్రకటించడం బాధాకరం. హింసకు బదులు శాంతియుతంగా నిరసన తెలపాలని దేశంలోని యువకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు
సికింద్రాబాద్ లో విధ్వంసం తర్వాత రైల్వే అధికారులు రిస్క్ ఏరియాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా రైళ్లకు డీజిల్ నింపే పాయింట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన విధ్వంసం లో డీజిల్ పాయింట్లు కు నిప్పు పెట్టి ఉంటే అతిపెద్ద విస్ఫోటనం జరిగి ఉండదనే ఆందోళన అధికారులు వ్యక్తం చేయడంతో ఈ రోజు హెచ్చరికలు.. భద్రత పెంచారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వస్తున్న నిరసనలతో పలు చోట్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా.. శనివారం పరిస్థితులు కొంచెం శాంతించాయి. తమిళనాడు చెన్నైలోని సెక్రటేరియట్సమీపంలో యుద్ధ స్మారకం వద్ద భారీగా యువత గుమిగూడారు. వేలూర్, తిరువన్నామలై, తిరుప్పూర్ సహా పలు జిల్లాల నుంచి నిరసనకారులు వచ్చారు. దీంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అగ్నిపథ్ ను రద్దు చేసి, పాత పద్ధతిని కంటిన్యూ చేయాలని టీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ ద్వారా యువత భవిష్యత్ ను అంధకారంలో నెట్టేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్లే దేశంలో ఆందోళనలు జరుగుతున్నాయని అన్నారు.
పోలీసుల తీరుపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతిచెందిన రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. రాకేశ్ అంతిమయాత్రను టీఆర్ఎస్ పార్టీ యాత్రగా మార్చుకుంటున్నారని తీవ్రంగా ఆక్షేపించారు.
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రైల్వే స్టేషన్లలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. తిరుపతి, రేణిగుంట, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, గుంతకల్, అనంతపురం రైల్వే స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. ప్రవేశ మార్గాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చెలరేగిన అల్లర్ల ఘటనలో పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.
సికింద్రాబాద్ అల్లర్ల కేసులో ఇప్పటి వరకు 22 మంది అరెస్టు అయ్యారు. ఆందోళనకారుల్లో ఎక్కువ మంది సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన వారిగా గుర్తించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చిన రైలులో 450 మంది సాయి అకాడమీ అభ్యర్థులు ఉన్నట్లు గుర్తించారు.
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ వద్ద కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టు అయ్యారు. సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో మృతి చెందిన రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వరంగల్ వెళ్తున్న రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో చెలరేగిన ఘర్షణలతో రద్దయిన ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లను పునరుద్ధరించారు. నిన్న రద్దయిన రైళ్లలో ముందుగా ఇంటర్ సిటీ రైళ్ళను ప్రారంభించారు. విశాఖ- సికింద్రాబాద్, గుంటూరు- సికింద్రాబాద్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ చేరుకున్న ఈ రైళ్లు తిరిగి ప్రయాణం ప్రారంభించాయి.
అగ్నిపథ్ ఆందోళనలతో తిరుపతి నిఘా నీడలోకి వెళ్లిపోయింది. తిరుపతి, రేణిగుంట, పాకాల, గూడూరు జంక్షన్‌లలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. స్టేషన్‌లోకి వచ్చిపోయే ప్రయాణికులను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. రైల్వేస్టేషన్ చుట్టూ పటిష్ఠ బందోస్తు ఏర్పాటు చేశారు. ఆర్పీఎఫ్, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనలో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ అంతిమయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. పోచమ్మ మైదాన్ మీదుగా సాగుతున్న యాత్ర.. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్దకు రాగానే ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు.
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విజయవాడలో యువకులు ఆందోళన చేపట్టారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు నిర్బంధించారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాన్ని వ్యతిరేకించాల్సినది పోయి, రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి పాల్పడటం శోచనీయమని ఆందోళనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలను విడుదల చేయకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు.
సికింద్రాబాద్ అల్లర్ల ఘటనపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ పథకం గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్నో చర్చలు, సలహాలు తీసుకున్న తర్వాతే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. టీవీ9 నిర్వహిస్తున్న కాన్ క్లేవ్ లో ఆయన ఈ అంశంపై స్పందించారు.
విశాఖ రైల్వేస్టేషన్ వద్ద హైఅలర్ట్ కొనసాగుతోంది. స్టేషన్‌లోకి ప్రయాణీకులను అనుమతించడం లేదు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన విశాఖ సీపీ శ్రీకాంత్.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దని సూచించారు. విశాఖ నుంచి వెళ్లే రైళ్లను దారి మళ్లించారు. విశాఖ నుంచి వెళ్లాల్సిన రైళ్లు దువ్వాడ మీదుగా వెళ్తున్నాయి. అల్లర్లు జరగొచ్చన్న సమాచారంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
సికింద్రాబాద్ ఘటనలో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన రాకేశ్ అంతిమ యాత్ర కొనసాగుతోంది. దీనితో ప్రముఖ నేతలు, జనాలు పాల్గొంటున్నారు. రాకేశ్ మృతితో అతని స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గుంటూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైల్వేస్టేషన్ వద్దకు దూకొస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు, ఆర్మీ అభ్యర్థులను అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల హెచ్చరికలతో గుంటూరు నగరం అప్రమత్తమైంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు రైల్వేస్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లను ఏఎస్పీ అనిల్ కుమార్ పరిశీలించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మాచర్ల-విజయవాడ ప్యాసింజర్ రైలులో ఆందోళనకారులు వస్తున్నట్టు సమాచారంతో ఐదో నెంబర్ ప్లాట్‌ఫాంపై పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో ఒంగోలులో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లతో పాటు ప్రభుత్వ కార్యాలయాల దగ్గర బందోబస్తు పెంచారు. పాత నేరస్థులు, రౌడీషీటర్స్‌పై నిఘా ఉంచారు. విద్యార్థి సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. కాగా.. రైలు సర్వీసులు యధావిధిగా నడుస్తున్నాయి. రైల్వే అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకుంటూ రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాకపోకలు సాగించే రైళ్లు, ప్రయాణీకులతో రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన విధ్వంసం.. 24 గంటల తర్వాత సద్దుమణగి, సాధారణ పరిస్థితికి వచ్చింది. టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరుచుకున్నాయి. ఉదయం నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా రైళ్లు నడుస్తున్నాయి.
సికింద్రాబాద్ విధ్వంసం ఘటనలో ప్రధాన సూత్రధారి ఆవుల సుబ్బారావును పోలీసులు ఖమ్మంలో అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. ఆవుల సుబ్బారావు సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దాడి ఘటనలో 1500 మంది పాల్గొన్నట్లు ఎస్పీ అనురాధ వెల్లడించారు. పలువురి అదుపులోకి తీసుకున్నామన్న ఆమె.. అల్లర్ల ఘటనలో ఎలాంటి కుట్రకోణం లేదని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా రాజస్థాన్, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, ఏపీ, తెలంగాణల్లో నిరసనలు జరుగుతున్నాయి. నేడు బిహార్ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీలు సమ్మెకు తమ మద్దతును ప్రకటించాయి.
విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి రైల్వే స్టేషనల్లో పోలీసులు భద్రత పటిష్ఠం చేశారు. వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న సందేశాలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టికెట్ లేకుండా స్టేషన్ లోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్నారు.
అగ్నిపథ్ పథాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనతో ఆంధ్రప్రదేశ్ లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. అల్లర్లు విశాఖపట్నానికి వకిస్తరించవచ్చన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో రైల్వేస్టేషన్ లో అధికారులు అప్రమత్తమయ్యారు. అర్పీఫ్ తో కలిసి రాత్రి నుంచే గస్తీ కాస్తున్నారు. టికెట్ ఉంటేనే స్టేషన్ లోకి అనుమతిస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. నగరమంతా తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలుంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.