అన్నకు తగ్గ తమ్ముడు నెహల్ మోడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు టోకరా ఇచ్చి బుక్కయ్యాడు

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచి లండన్ చెక్కేసిన నీరవ్ మోడీకి గంతకు తగ్గ బొంత లాంటి తమ్ముడున్నాడు. అతడే  నెహల్ మోడీ..

అన్నకు తగ్గ తమ్ముడు నెహల్ మోడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు టోకరా ఇచ్చి బుక్కయ్యాడు
Nehal Modi

Edited By: Phani CH

Updated on: Mar 27, 2021 | 7:23 PM

పంజాబ్ నేషనల్ బ్యాంకును నిండా ముంచి లండన్ చెక్కేసిన నీరవ్ మోడీకి గంతకు తగ్గ బొంత లాంటి తమ్ముడున్నాడు. అతడే  నెహల్ మోడీ.. ఇతని పేరు ఇప్పటివరకు ప్రచారం లోకి రాకపోయినా.సీబీఐ తాజాగా ఇతని పేరును కూడా బయటపెటింది. బెల్జియంవాసి అయిన  ఇతడిని మన  దేశానికి అప్పగించాలని కోరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ఇతగాడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాడు.  నెహల్ పై అక్కడి కోర్టులో  కూడా ఓ ఫ్రాడ్ కేసు దాఖలైందని తెలియడంతో అధికారులు ఇక ఇందుకు నడుం బిగించారు. 2019 లో ఇంటర్ పోల్ ఇతనికోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలో..ఇతడిని భారత్ కు అప్పగించే విషయమై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడవలసిందిగా భారత సర్కారుని కోరాలంటూ ముంబై స్పెషల్ కోర్టులో ఓ అఫిడవిట్ ని అధికారులు దాఖలు చేశారు. పీ ఎన్ బీ ఫ్రాడ్ కేసులో ఇతడిని నిందితునిగా పేర్కొంటూ సీబీఐతో బాటు ఈడీ కూడా కేసు దాఖలు చేసింది. తాను పట్టుబడకుండా ఉండేందుకు నెహల్ ఎలెక్ట్రానిక్   సాక్ష్యాధారాలను నాశనం చేశాడని కూడా ఈడీ గుర్తించింది. 2019 లోనే ఇతనిపై సీబీఐ ఓ అనుబంధ  ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. తన సోదరుడు నీరవ్ మోడీకి సహాయపడేందుకు ఒక లాయర్ నుంచి, జడ్జి నుంచి అనుకూలమైన  స్టేట్ మెంట్ వచ్చేలా చూడడానికి యూరప్ వెళ్లాల్సిందిగా ఒక డమ్మీ డైరెక్టర్ కి నెహల్ 20 లక్షలు ఇవ్వజూపాడని ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

దుబాయ్ నుంచి కైరోకి ఉద్యోగులను, డమ్మీ డైరెక్టర్లను విమానాల్లో పంపే యత్నం చేశాడని, పైగా కేసు దర్యాప్తులో సహకరించకుండా వారు తిరిగి ఇండియాకు రాకూడదన్నట్టు వివిధ ప్రయత్నాలు సైతం చేసినట్టు ఇందులో తెలిపారు.దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఇతడు డాక్యుమెంట్లను తారుమారు చేశాడని సైతం వెల్లడైంది. కాగా-ఇతని సోదరుడు నీరవ్ మోడీని భారత్ కు అప్పగించాలని లండన్ కోర్టు  గత నెలలో ఆదేశించిన  విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చదవండి: President Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌కు‌ బైపాస్ సర్జరీ సన్నాహాలు.. పూర్తి వివరాలు ఇవి

Covid-19: ఆ ఆరు రాష్ట్రాల్లోనే కరోనా విజృంభణ.. మహారాష్ట్రలో సగానికిపైగా కేసులు