Hyundai Tweets: కశ్మీర్ అంశంపై ట్వీట్లు చేసిన విదేశీ దిగ్గజ కంపెనీలైన హ్యుందాయ్, కేఎఫ్ సి, కియా, పిజ్జా హట్ వంటి సంస్థలకు దేశీయంగా తీవ్ర వ్యతిరైకత ఎదురవుతోంది. తాజాగా భారత ప్రభుత్వం దక్షిణ కొరియా అంబాసిడర్ కు సమన్లు కూడా జారీ చేసింది. పాకిస్థాన్ చేపడుతున్న టెర్రరిస్ట్ కార్యకలాపాలను సమర్థించే విధంగా హ్యుందాయ్ ట్వీట్లు ఉన్నాయని భారత్ ఆక్షేపించింది. ఇలాంటివి తాము సహించబోమనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. ఈ సంస్థలు తమ పాకిస్థాన్ ట్విట్టర్ ఖాతాల నుంచి చేసిన పోస్టులకు భారత్ లో తీవ్ర వ్యతిరేకత మెుదలైంది. దీంతో పాటు సదరు సంస్థల వస్తుసేవలను బాయ్ కాట్ చేయాలంటూ నెటిజన్లు చేసిన వరుస ట్వీట్లతో కంపెనీలు నష్టనివారణ చర్యలు ప్రారంభించాయి. దక్షిణ కొరియా దిగ్గజ కార్ల కంపెనీ హ్యుందాయ్ పాకిస్థాన్ వ్యాపార విభాగం సోషల్ మీడియా ఖాతాలో చేసిన కొన్ని కామెంట్లు దుమారంగా మారాయి. ”కశ్మీర్ కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుందాం, స్వాతంత్ర్యం కోసం వారు చేస్తున్న పోరాటానికి అండగా నిలుద్దాం” అంటూ పేర్కొంది.
పాకిస్థాన్ ఏటా ఫిబ్రవరి 5న నిర్వహించే కశ్మీర్ సంస్మరణ దినం సందర్భంగా చేసిన వివాదాస్పదమైన పోస్టుతో నెట్టిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హ్యుందాయ్ కార్ల కొనొద్దంటూ సామాజికమాధ్యమంలో ‘బాయ్‌కాట్ హ్యుందాయ్’ అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. టాటా మోటార్స్ మరియు మహీంద్రా & మహీంద్రా వంటి స్వదేశీ బ్రాండ్‌లకు మద్దతునిస్తూ కంపెనీని శిక్షించేందుకు.. దేశీయ వాహన వినియోగదారులు తమ హ్యుందాయ్ కార్ల ఆర్డర్‌లను రద్దు చేసుకోవాలంటూ పోస్టులు చేశారు.
Dear @KFC_India while we accept your apology we would ask you to write to your parent firm @kfc asking them to remove any KFC branded statements supporting terrorism against #Indians by any of your global operations .
Please post that letter here as well ?? https://t.co/UKqNvxyzYL— Ninjamonkey ?? (@Aryan_warlord) February 7, 2022
దేశం బయట తమ కంపెనీ సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్టులపై తాము చింతిస్తున్నామంటూ కేఎఫ్ సి భారత విభాగం ఓ పోస్టు పెట్టింది. భారత్ అంటే తమకు గౌరవమని.. భారతీయులకు సేవలు అందించడం గర్వంగా భావిస్తున్నామని వివరణ ఇచ్చింది.
దీంతో అప్రమత్తమైన కంపెనీ.. తాము 25 సంవత్సరాలుగా భారత్‌లో కార్యకలాపాలను సాగిస్తున్నామని.. జాతీయవాదానికి తాము కట్టుబడి ఉన్నామంటూ వివరణ కూడా ఇచ్చింది. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. తమ మాతృసంస్థకు భారత్ రెండో ఇల్లులాంటిదని వెల్లడించింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ స్పందిస్తూ.. వివాదాన్ని తాము సంస్థ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. సంస్థ ఓ ప్రకటన విడుదల చేసినప్పటికీ నిస్సంకోచంగా క్షమాపణ చెప్పాల్సిందని అన్నారు.
ఇవీ చదవండి…
Stocks vs Mutual Funds: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెటర్.. ఎందులో రిస్క్ తక్కువ ఉంటుంది..