AdiVaani: గిరిజన భాషల పరిరక్షణకు కీలక ముందడుగు..! ఆదివాణి పేరుతో AI ట్రాన్స్‌లేటింగ్‌ యాప్‌

భారత ప్రభుత్వం గిరిజన భాషలను కాపాడేందుకు 'ఆదివాణి' అనే AI ఆధారిత అనువాద యాప్‌ను ప్రారంభించింది. ఇది గిరిజన భాషలను ఇతర భాషలకు అనువదించడానికి సహాయపడుతుంది. కమ్యూనికేషన్ లోని అంతరాలను తగ్గించడం, గిరిజన సంస్కృతి ని సంరక్షించడం ఈ యాప్ లక్ష్యం.

AdiVaani: గిరిజన భాషల పరిరక్షణకు కీలక ముందడుగు..! ఆదివాణి పేరుతో AI ట్రాన్స్‌లేటింగ్‌ యాప్‌
Pm Modi Aadivaani App

Updated on: Sep 13, 2025 | 2:25 PM

మన దేశంలో ఎన్నో భాషల ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. మిగిలిన చాలా భాషలకు లిపి కూడా లేదు. అంత మాత్రానా అవి తక్కువని కాదు. కానీ, తక్కువ మంది మాట్లాడే భాషలుగా ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన సమాజం మాట్లాడే అనేక భాషలు ప్రస్తుతం అంతరించి పోతున్న దశలో ఉన్నాయి. అయితే అవి మన వారసత్వ సంపదగా భావిస్తూ వాటిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కేవలం అలా అనుకోవడమే కాదు గిరిజన భాషలను రక్షించేందుకు ఒక ముందడుగు కూడా వేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గిరిజన వ్యవహారాల మంత్రి దార్శనిక నాయకత్వంలో గిరిజన భాషా పరిరక్షణకు ఆది వాణి పేరుతో గిరిజన భాషల కోసం AI ట్రాన్స్‌లేటర్‌ (బీటా వెర్షన్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై ఎంతో వర్క్‌ చేసింది. ఇలాంటి ఓ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పేందుకు తాము గర్విస్తున్నామని కూడా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కమ్యూనికేషన్ అంతరాలను తగ్గించడానికి, భారతదేశ గొప్ప గిరిజన వారసత్వాన్ని జరుపుకోవడానికి ఇది ఒక చారిత్రాత్మక అడుగుగా మనం చెప్పుకోవచ్చు. కాగా ప్రస్తుతం ఈ ఆదివాణి యాప్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. యాప్‌ను మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకొని, గిరిజన భాషల పరిరక్షణ మిషన్‌లో భాగం అవ్వండి. యాప్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి