AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani row: అదానీ వివాదంపై నిపుణులతో కమిటీ వేస్తే బాగుంటుంది.. కేంద్రానికి , సెబీకి సుప్రీం నోటీసులు..

అదానీ-హిండెన్‌బర్గ్‌ వివాదంపై రగడ ఇప్పట్లో ఆగే అవకాశాలు కన్పించడం లేదు. జేపీసీ కోసం పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై నిపుణుల కమిటీ వేసి, ఇన్వెస్టర్లకు నష్టం కలగకుండా చూడాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.

Adani row: అదానీ వివాదంపై నిపుణులతో కమిటీ వేస్తే బాగుంటుంది.. కేంద్రానికి , సెబీకి సుప్రీం నోటీసులు..
Adani Supreme Court
Sanjay Kasula
|

Updated on: Feb 10, 2023 | 8:51 PM

Share

అదానీ -హిండెన్‌బర్గ్‌ వివాదంపై పార్లమెంట్‌లో రచ్చ కొనసాగుతోంది. జేపీసీ విచారణకు విపక్షాలు మరోసారి డిమాండ్‌ చేశాయి. ఈ వ్యవహారంపై అధికార , విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదానీ గ్రూప్‌పై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో రగడ జరిగింది. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఖర్గే. తాము జేపీసీని మాత్రమే కోరుతున్నామని,దీనిపై బీజేపీకి ఎందుకు అభ్యంతరమన్నారు ఖర్గే.

తాను సభా నిబంధనలను పాటిస్తున్నానని..తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటూ స్పష్టం చేశారు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌. సభ జరగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. మరోవైపు రాజ్యసభ నుంచి కాంగ్రెస్‌ ఎంపీ రజనీపాటిల్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ సెషన్‌ వరకు సస్పెండ్‌ చేస్తునట్టు తెలిపారు రాజ్యసభ ఛైర్మన్‌. బడ్జెట్‌పై ప్రధాని మోదీ వివరణ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని రికార్డు చేసి వైరల్‌ చేయడంపై చర్యలు తీసుకకున్నారు.

ఇన్వెస్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన

అదానీ -హిండెన్‌బర్గ్‌ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇన్వెస్టర్ల భద్రతపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం నిపుణులతో కమిటీ వేస్తే బాగుంటుందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సెబీతో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణ ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు తమ ప్రతిష్టను హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ దెబ్బతీసిందంటూ అమెరికా కోర్టు అదానీ సంస్థ న్యాయపోరాటానికి దిగింది. వాచ్‌టెల్‌ సంస్థను అదానీ గ్రూప్‌ లోకి దింపింది. అమెరికాలో టాప్‌ లీగల్‌ సంస్థగా వాచ్‌టెల్‌కు పేరుంది. కార్పొరేట్‌ కేసుల్లో ఆ సంస్థకు చాలా రికార్డు ఉంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం