ఆ వీసీని తొలగించాల్సిందే.. బీజేపీ సీనియర్ నేత డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Jan 10, 2020 | 9:39 AM

ఢిల్లీలోని జేఎన్‌యూలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా స్పందించారు. విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపును ఆయన ఖండించారు. కేంద్ర మానవవనరుల శాఖ ప్రతిపాదనలను అమలుపరచకుండా.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ పదవికి జగదీష్ కుమార్ సరికాడంటూ మురళీ మనోహర్ జొషి ట్వీట్ చేశారు. యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలంటే తక్షణమే ఆయన్న […]

ఆ వీసీని తొలగించాల్సిందే.. బీజేపీ సీనియర్ నేత డిమాండ్
Follow us on

ఢిల్లీలోని జేఎన్‌యూలో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి తీవ్రంగా స్పందించారు. విశ్వవిద్యాలయంలో ఫీజుల పెంపును ఆయన ఖండించారు. కేంద్ర మానవవనరుల శాఖ ప్రతిపాదనలను అమలుపరచకుండా.. యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌ పదవికి జగదీష్ కుమార్ సరికాడంటూ మురళీ మనోహర్ జొషి ట్వీట్ చేశారు.
యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలంటే తక్షణమే ఆయన్న వీసీగా తొలగించాలని డిమాండ్ చేశారు.

జేఎన్‌యూకి సబంధించి ఫీజుల పెంపు సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రెండు సార్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌కి సలహాలు, సూచనలు చేసిందని.. కానీ ప్రభుత్వ సలహాలను పట్టించుకోకుండా.. మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. వీసీ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని.. ఇలాంటి వ్యక్తిని వైస్ చాన్స్‌లర్ పదవిలో కొనసాగించడం.. సరికాదంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, యూనివర్సిటీలో ఫీజుల పెంపు అంశంపై విద్యార్థులు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఈ విషయంలో గురువారం ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలలం కాలేదు. దీంతో విద్యార్థులు ఆందోళనలకు దిగారు. అంతేకాదు.. రాష్ట్రపతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్ధుల్ని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నిరసనలకు దిగిన పలువురు విదయార్ధుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.