Viral: పైకి చూసేందుకు మార్బల్ ఫ్లోరింగ్.. నేలను తవ్వి చూడగా మైండ్ బ్లాంక్!

సాధారణంగా ఏ ఇంటి గోడలనైనా ఇటుకలతో నిర్మిస్తారు. గోడను తవ్వి చూస్తే ఇటుకలే బయటపడుతుంటాయి. అయితే ముంబయిలోని..

Viral: పైకి చూసేందుకు మార్బల్ ఫ్లోరింగ్.. నేలను తవ్వి చూడగా మైండ్ బ్లాంక్!
Crime

Edited By:

Updated on: Apr 27, 2022 | 4:13 PM

సాధారణంగా ఏ ఇంటి గోడలనైనా ఇటుకలతో నిర్మిస్తారు. గోడను తవ్వి చూస్తే ఇటుకలే బయటపడుతుంటాయి. అయితే ముంబయిలోని ఒక వ్యాపార సంస్థ కార్యాలయం గోడలో మాత్రం కోట్ల రూపాయల నగదు, వెండి ఇటుకలు బయటపడ్డాయి. సుమారు పదికోట్ల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు.

ముంబైలో నగలు, వజ్రాల వ్యాపారానికి ప్రధాన నిలయమైన జవేరీ బజార్‌లో ఓ నగల వ్యాపారి తన కార్యాలయం గోడలో దాచిన భారీ ధనం వెలుగు చూసింది. చాముండా బులియన్‌ అనే జ్వువెలర్స్‌ కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ విభాగం ఆకస్మిక దాడి చేసింది. తనిఖీల్లో కార్యాలయం గోడలో దాచిన 19 కేజీల వెండి ఇటుకలు,10 కోట్లరూపాయల నగదు బయట పడ్డాయి. ఈ ధనాన్ని అధికారులు జప్తు చేశారు.

ఇటీవల ఆ కంపెనీ లావాదేవీలను పరిశీలించిన జిఎస్‌టి అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే చాముండా బులియన్‌ టర్నోవర్‌ 23 లక్షల నుంచి 1,764 కోట్ల రూపాయలకు పెరిగినట్లు గుర్తించారు. దీంతో జిఎస్‌టి అధికారులు కల్బాదేవి సహా మూడు ప్రాంతాల్లో ఉన్న ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Viral: ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన వ్యక్తి.. తీరా ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

Viral Photo: మీ కళ్లకి ఓ పరీక్ష.. ఈ ఫోటోలో దాగున్న సంఖ్యను చెప్పగలరా.? గుర్తిస్తే మీరే గ్రేట్!