పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇన్ని రోజులు పార్టీల పరంగా జరిగిన గొడవలు కాస్తా.. విద్యార్ధి సంఘాలకు పాకాయి. హౌరాలో టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు, ఏబీవీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను తరలించారు. తొలుత టీఎంసీ విద్యార్ధి పరిషత్ కార్యకర్తలు తమపై దాడికి దిగారని.. ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అయితే కాలేజ్‌లోకి కావాలనే ఏబీవీపీ నేతలు రౌడీలను తీసుకొచ్చారని తృణమూల్ కార్యకర్తలు ఆరోపించారు. గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.