అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్ బచ్చన్‌కి ఆయన కుమారుడు, సినీ నటుడు అభిషేక్ బచ్చన్ అభినందనలు తెలుపుతూ.. తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తల్లి జయాబచ్చన్, డాడీతో కలిసి తాను దిగిన ఫోటోను ఆదివారం సాయంత్రం రిలీజ్ చేశాడు. గుండెల నిండుగా నవ్వుతున్న ఈ ముగ్గురి ఫోటో వైరల్ అవుతోంది. ‘ ఎ మెమొరీ టు చెరిష్.. దాదాసాహెబ్ అవార్డ్… ది పేరంటల్స్ .. ది గురూ ‘ అని అభిషేక్ కామెంట్ పెట్టాడు. మరో పోస్ట్ లో తన తండ్రికి ఈ అవార్డు లభించడం తనకెంతో ఆనందంగా ఉందని, నాకు మీరు స్ఫూర్తి ‘ అంటూనే ‘ మై హీరో… కంగ్రాచ్యులేషన్స్ ‘ పా ‘… వుయ్ ఆర్ సో ఫ్రౌడ్ ఆఫ్ యు.. ఐ లవ్ యు ‘ అని కూడా అన్నాడు.
ఇక బిగ్ బీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా తానీ అవార్డు అందుకున్నప్పటి ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఈ పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఆయన సరదాగా తన మనోగతాన్ని బయటపెట్టారు. ‘ ఈ అవార్డును నాకు ప్రకటించాక నా మనసులో ఓ అనుమానం తలెత్తుతోంది.. ఇది ఎన్నో ఏళ్ళ తరువాత పని చేసిన అనంతరం (సినీ రంగంలో) నేను ఇంట్లో కూర్చుని రిలాక్స్ కావడానికి సంకేతమా అనిపించింది. ‘ అని ఆయన పేర్కొన్నారు. అయితే తాను పూర్తి చేయాల్సిన పని ఇంకా మరి కొంత ఉందని, దాని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నానని అమితాబ్ అన్నారు. కాగా.. ఈ బాలీవుడ్ కింగ్.. తాప్సీ పొన్నుతో కలిసి నటించిన చిత్రం ‘ బద్లా ‘ ఆ మధ్య రిలీజయింది. ఇంకా…. ‘ గులాబో, సితాబో ‘, ‘ చెహరే ‘, ‘ ఝుండ్ ‘ అనే మూడు చిత్రాలు బిగ్ బీ చేతుల్లో ఉన్నాయి.
T 3592/3/4/5 – .. my immense gratitude and respect for this moment ..? pic.twitter.com/WavW3Hwkjw
— Amitabh Bachchan (@SrBachchan) December 29, 2019