AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kejriwal: అలా చేయకపోతే గుజరాత్ నుంచి తరిమి కొట్టండి.. కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించి పంజాబ్(Punjab) లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ ముఖ్యనేతల ఇలాకా అయిన గుజరాత్ లోనూ పాగా వేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని నెలల్లోనే....

Kejriwal: అలా చేయకపోతే గుజరాత్ నుంచి తరిమి కొట్టండి.. కేజ్రీవాల్ సెన్సేషనల్ కామెంట్
Kejriwal
Ganesh Mudavath
|

Updated on: May 01, 2022 | 7:12 PM

Share

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించి పంజాబ్(Punjab) లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీ ముఖ్యనేతల ఇలాకా అయిన గుజరాత్ లోనూ పాగా వేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న గుజరాత్‌(Gujarat) లో గెలుపు కోసం ఆప్ అధినేత, అరవింద్ కేజ్రీవాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఎగ్జామ్ జరిగినా.. క్వశ్చన్ పేపర్ లీక్ అవుతోందని, పేపర్ లీక్ అవకుండా ఏ ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేకపోతున్నారని మండిపడ్డారు. ఊ దుస్థితికి అధికార బీజేపీ(BJP) నే కారణమని నిప్పులు చెరిగారు. ఇలా అధ్వాన స్థితిలో ఉన్న గుజరాత్‌లోని వ్యవస్థలను మార్చేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. అలా చేయడంలో తాము విఫలమైతే రాష్ట్రం నుంచి వెళ్లగొట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో 6వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయన్న కేజ్రీవాల్.. మరిన్ని శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఫలితంగా లక్షల మంది చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో పాఠశాలలను మార్చినట్లుగా గుజరాత్‌లోనూ వాటిని పూర్తిగా మారుస్తామని వెల్లడించారు. గుజరాత్ లోని భరూచ్‌లో ఆయన పర్యటించారు. ఢిల్లీ మాదిరిగా గుజరాత్ లోనూ మోహల్లా క్లినిక్‌లను ప్రారంభించి, ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తానని వివరించారు.

పరీక్షల పేపర్‌ లీకేజీల్లో గుజరాత్‌ ప్రపంచ రికార్డు సాధించిందని అరవింద్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. పేపర్‌ లీకేజీ లేకుండా కనీసం ఒక్క పరీక్షైనా నిర్వహించగలరా అని గుజరాత్ సీఎఁ భూపేంద్ర పటేల్‌కు సవాల్‌ విసిరారు. మరోవైపు.. ఢిల్లీ మోడల్ పేరుతో పలు రాష్ట్రాలకు విస్తరించేందుకు ప్రయత్నిస్తోన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఇటీవల జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. అదే ఉత్సాహంతో ఉన్న ఆప్‌.. మరికొన్ని నెలల్లోనే జరగబోయే గుజరాత్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది.

ఢిల్లీలో, ధనవంతులు, పేదల పిల్లలు కలిసి చదువుతున్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈసారి 99.7% ఉత్తీర్ణత నమోదైందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు 58 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఆప్ చేపట్టిన రహస్య సర్వేలో తెలింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

AHA OTT: తెలుగు ఆడియన్స్‌ కోసం ఆహా మరో సర్‌ప్రైజ్‌.. నేషనల్‌ అవార్డు సినిమాను..

Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..