Aadhaar Co-Win App : కో-విన్‌కు ఆధార్‌ తప్పనిసరి కాదు: లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి

|

Feb 06, 2021 | 1:44 PM

Aadhaar Co-Win App: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉద్దేశించి ఏర్పాటు చేసిన కో-విన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరి కాదని కేంద్ర..

Aadhaar Co-Win App : కో-విన్‌కు ఆధార్‌ తప్పనిసరి కాదు: లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన మంత్రి
Follow us on

Aadhaar Co-Win App: కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి ఉద్దేశించి ఏర్పాటు చేసిన కో-విన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వనీ చౌబే లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ పోర్టల్‌ను యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రామ్‌ సహకారంతో కేంద్ర ఆరోగ్యశాఖ రూపొందించిందని తెలిపారు. కో-విన్‌ యాప్‌లోనూ రిజిస్ట్రేషన్‌ కోసం ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ పోర్టల్‌లో ఫిబ్రవరి 1 వరకు 58.90 లక్షల మంది నమోదు చేసుకున్నారని మంత్రి వెల్లడించారు.

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఏడాది పాటు ప్రపంచాన్ని వణికించిన కరోనాను కట్టడి కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్‌ తయారీలో తీవ్రంగా కృషి చేసి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కోవిడ్‌ వ్యాక్సిన్లు ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించారు.

Also Read: Farmers Protest: ఉద్యమం ఒక్క రాష్ట్రానికే పరిమితం.. రైతులను రెచ్చగొడుతున్నారు: కేంద్ర మంత్రి తోమర్