Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..

|

Feb 03, 2021 | 5:44 AM

ప్రతి పనిలో ఆధార్‌ తప్పనిసరి అయిన సందర్భంలో ఆధార్‌ సేవలను కూడా విస్తరిస్తున్నారు అధికారులు. ఆధార్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే...

Aadhaar: ఇకపై ఇంటి నుంచే ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవచ్చు.. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన యూఐడీఏఐ..
Follow us on

Aadhaar Helpline Number: సిమ్‌ కార్డు నుంచి ఇంటి లోన్‌ వరకు, రైళు నుంచి ఫ్లైట్‌ టికెట్‌ బుకింగ్‌ వరకు ఇప్పుడు ఆధార్‌ తప్పనిసరిగా మారిపోయింది. ఆధార్‌ కార్డు ఒక్కటి ఉంటే చాలు మీ మొత్తం సమాచారం తెలిసిపోతుంది.
ఇలా ప్రతి పనిలో ఆధార్‌ తప్పనిసరి అయిన సందర్భంలో ఆధార్‌ సేవలను కూడా విస్తరిస్తున్నారు అధికారులు. ఆధార్‌లో ఏవైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే కచ్చితంగా ఆధార్‌ కేంద్రానికి వెళ్లక తప్పని పరిస్థితి. అయితే కొన్ని సందర్భాల్లో తెలియని ప్రదేశాలకు వెళ్లినా లేదా మీరున్న ప్రదేశంలో ఆధార్‌ సేవా కేంద్రం ఎక్కడ ఉందో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారికోసమే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీకు దగ్గర్లో ఉన్న ఆధార్‌ కేంద్రాన్ని ఎంతో సులభంగా తెలుసుకునేందుకుగాను.. ఓ టోల్‌ ఫ్రీ నెంబర్‌ను తీసుకొచ్చింది. 1947 నెంబర్‌కు ఫోన్‌ చేసి మీ దగ్గర్లో ఉన్న కేంద్రాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. ఇక ఇదే టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఆధార్‌ కార్డులో కొన్ని వివరాలను ఇంటి వద్ద నుంచే అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ‘ఎమ్‌ఆధార్‌’ యాప్‌ ద్వారా కూడా ఆధార్‌ కేంద్రాల లొకేషన్‌ను తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ విషయమై ‘ఆధార్‌’ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ఇందులో ఆధార్‌ కేంద్రాల లొకేషన్లను మరింత సులభంగా తెలుసుకునేలా బార్‌ కోడ్‌ను కూడా అందించారు. దీన్ని స్కాన్‌ చేస్తే చాలు లొకేషన్‌ మరింత సింపుల్‌గా తెలిసిపోతుంది.

Also Read: Doomsday Clock : ప్రళయం ముంచుకొస్తోందా…? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా..? డూమ్స్ డే ఏం చెబుతోంది..!