Train Video: రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ చేసిన పనికి అభినందించాల్సిందే..

|

Dec 02, 2022 | 6:43 AM

భారతీయ రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు నిరంతరం సేవలు అందిస్తున్నాయి. అయితే రైలులో ప్రయాణం చేయాలంటే ముందుగానే టిక్కెట్ బుక్...

Train Video: రైలు ఎక్కేందుకు మహిళ అగచాట్లు.. లోకో పైలట్ చేసిన పనికి అభినందించాల్సిందే..
Woman Train Video
Follow us on

భారతీయ రవాణా వ్యవస్థలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు నిరంతరం సేవలు అందిస్తున్నాయి. అయితే రైలులో ప్రయాణం చేయాలంటే ముందుగానే టిక్కెట్ బుక్ చేసుకోవాలి. ఇయినా టిక్కెట్ దొరకకపోతే ప్రత్యామ్నాయం చూసుకోవడమో లేక జనరల్ కంపార్ట్ మెంట్లలో జర్నీ చేయాల్సిందే. అసలే రద్దీగా ఉండే రైలులో ప్రయాణించడం చాలా కష్టం. కాలు పెట్టడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో జర్నీ చేయడం అంటే నరకంలో ఉన్నట్లే. సీటు కూడా దొరక్కపోవడంతో దారి పొడవునా నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తుంది. కొందరు మాత్రం విధి లేని పరిస్థితుల్లో నేలపైనే కూర్చుంటారు. అలాంటప్పుడు చాలా సార్లు గొడవ జరుగుతుంది. ప్రజా రవాణా వ్యవస్థలో మహిళల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వారికంటూ కొన్ని సీట్లు ఉంటాయి. కానీ ప్రస్తుత రోజుల్లో రద్దీ గా ఉన్న రైళ్లల్లో ఇలాంటి రూల్స్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. కాదని గట్టిగా మాట్లాడితే మహిళలు అని కూడా చూడకుండా వాదనకు దిగుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ రద్దీగా ఉండే లోకల్ ట్రైన్‌లో ఎక్కేందుకు ప్రయత్నించడాన్ని చూడవచ్చు. కానీ రద్దీ అధికంగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఆమె తలుపుల వద్ద ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తలపులు మూసుకోలేదు. అక్కడ ఉన్న వారు ఆమెను తప్పుకోవాలని సూచించారు. అయితే రైలు లోపల కాలు పెట్టేందుకు కూడా చోటు లేకపోవడంతో ఆమె కదలలేకపోయింది. విషయాన్ని గమనించిన లోకో పైలట్ ఆమె వద్దకు వచ్చాడు. ఆమెను సముదాయించి, రైలు దిగేలా చేశారు. అనంతరం ఎవరూ ఊహించని విధంగా ఇంజిన్ క్యాబిన్ లో తాము విధులు నిర్వర్తించే ప్రదేశంలో ఆమెను కూర్చోబెట్టారు. అనంతరం రైలు మూవ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వార్త రాసే వరకు 19 వేలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ‘ఆమె ఒక మహిళ కాబట్టి ఆమెను గౌరవించాలి’ అని, ‘లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం సరైనదే’ అని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..