Watch Video: ఆసుపత్రిలో రగడ.. పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్.. వీడియో వైరల్..

|

Apr 27, 2021 | 10:30 AM

Rampur District hospital: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు బలికొంటూ.. ఎటుటివారి భావోద్వేగాలతో కూడా ఓ ఆట ఆడుకుంటోంది. దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు

Watch Video: ఆసుపత్రిలో రగడ.. పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్.. వీడియో వైరల్..
Rampur District Hospital
Follow us on

Rampur District hospital: కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు బలికొంటూ.. ఎటుటివారి భావోద్వేగాలతో కూడా ఓ ఆట ఆడుకుంటోంది. దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ.. వారు రోగులకు సేవలందిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తించడం తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ప‌లు ఆసుపత్రుల్లో డాక్ట‌ర్ల‌కు, డాక్ట‌ర్ల‌కు మ‌ధ్య‌.. డాక్ట‌ర్ల‌కు న‌ర్సుల‌కు మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఒత్తిడిలో స‌హ‌నం కోల్పోయి ఒక‌రిపై మ‌రొక‌రు దూష‌ణ‌ల‌కు దిగడమే కాకుండా.. చేయి చేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో డాక్ట‌ర్‌కు, న‌ర్సుకు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఇద్దరూ కూడా ఒక‌రిని ఒక‌రు దూషించుకున్నారు. చివ‌రికి స‌హ‌నం కోల్పోయి న‌ర్సు డాక్ట‌ర్ చెంప‌పై గ‌ట్టిగా కొట్టింది. దాంతో డాక్ట‌ర్ ఆమెపై దాడికి పాల్ప‌డ్డాడు. ఈ ఘటన సోమవారం పోలీసుల ముందే జరగడం గమనార్హం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్‌జీ మిశ్రా కూడా ఘ‌ట‌న‌పై ఇద్ద‌రిని వేర్వేరుగా విచారించారు. కొట్లాడుతున్న‌ డాక్ట‌ర్‌, న‌ర్సు ఇద్ద‌రితో విడివిడిగా మాట్లాడాన‌ని, ఇద్ద‌రూ కూడా ప‌ని ఒత్తిడిని త‌ట్టుకోలేక‌నే తాము స‌హ‌నం కోల్పోయి ఇలా ప్రవర్తించామని చెప్పార‌ని మిశ్రా తెలిపారు. ఘ‌ట‌న‌పై త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతోందని వెల్లడించారు.

వీడియో..

Also Read:

India Covid-19: దేశంలో కొనసాగుతున్న కరోనా విలయతాండవం.. భారీగా కేసులు, మరణాలు నమోదు..

COVID-19 vaccine: కరోనా వ్యాక్సిన్ ధరలను తగ్గించండి.. సీరం, భారత్ బయోటెక్‌లను కోరిన కేంద్ర ప్రభుత్వం..