Shimla: ఐదేళ్ల కుర్రాడిని ఎత్తుకెళ్లిపోయిన వన్య మృగం.. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు..

|

Nov 06, 2021 | 1:15 PM

Shimla: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో దారుణం జరిగింది. దీపావళి పండుగ రోజు టపాకాయులు కాలుస్తోన్న సమయంలో ఓ ఐదేళ్ల కుర్రాడిని గుర్తు తెలియని వన్య మృగం ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది...

Shimla: ఐదేళ్ల కుర్రాడిని ఎత్తుకెళ్లిపోయిన వన్య మృగం.. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు..
Follow us on

Shimla: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో దారుణం జరిగింది. దీపావళి పండుగ రోజు టపాకాయులు కాలుస్తోన్న సమయంలో ఓ ఐదేళ్ల కుర్రాడిని గుర్తు తెలియని వన్య మృగం ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా స్థానికులంతా అలర్ట్‌ అయ్యారు. జనావాసల్లోకి వచ్చి మరీ కుర్రాడిని ఓ జంతువు వచ్చి ఎత్తుకెళ్లడం చర్చగా మారింది. వివరాల్లోకి వెళితే.. సిమ్లాలో గురువారం యోగ్‌రాజ్‌ అనే కుర్రాడు దీపావళి సందర్భంగా ఇంటి ఆవరణలో తన తమ్ముడితో కలిసి టపాకాయలు కాలుస్తున్నాడు. ఈ సమయంలోనే దగ్గరల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ మృగం కుర్రాడిని ఎత్తుకెళ్లిపోయింది. ఆ మృగం ఏంటన్న విషయం తెలియాల్సి ఉంది.

దీంతో విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి కుర్రాడి ఆచూకి కోసం వేట మొదలుపెట్టారు. ఈ విషయమై సిమ్లా డివిజన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రవి శంకర్‌ మాట్లాడుతూ.. ఆ కుర్రాడిని ఎత్తుకెళ్లిన జంతువు ఎంటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. తప్పిపోయిన కుర్రాడి తమ్ముడు చెప్పిన సమాచారం మేరకు ర్యాపిడ్‌ రెస్కూ టీమ్‌ రంగంలోకి దిగి బాలుడిని వెతికే పనిలో పడింది. సంఘటన జరిగిన ప్రదేశంలో బాలుడి ప్యాంటుకు సంబంధించిన ఆధారాలతో పాటు కొన్ని రక్తపు మరకలు గుర్తించిన అధికారులు.. అవి తప్పిపోయిన బాలుడివేనా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. ఇక సిమ్లా పోలీసులకు ఆ కుర్రాడి ఇంటికి సమీపంలో ప్యాంటు లభించింది. దాదాపు 50 మంది పోలీసులు కుర్రాడి ఆచూకి కోసం వెతుకుతున్నారు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుతూ ఉన్న చిన్నారి కనిపించకుండా పోయేసరికి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 ఇదిలా ఉంటే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. గడిచిన ఆగస్టులోనూ ఓ చిన్నారిని చిరుత ఇలాగే ఎత్తుకెళ్లిపోయింది. కన్లాగ్‌ సమీపంలో ఓ 5 ఏళ్ల చిన్నారిని చిరుత ఇలాగే ఎత్తుకెళ్లి హతమార్చింది. అయితే పోలీసులు ఆ చిరుతను ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. చిరుతను బంధించే క్రమంలో కెమెరా ట్రాప్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. మరి తాజాగా తప్పిపోయిన కుర్రాడు క్షేమంగానే ఉన్నాడో లేదా తెలియాల్సి ఉంది.

Also Read: Shyam Singha Roy: మాస్ లుక్‏లో అదరగొడుతున్న నాని.. శ్యామ్ సింగరాయ్ సాంగ్ రిలీజ్..

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??

Kim Jong-un: కిమ్‌ మరో సంచలనం నిర్ణయం.. తక్కువ తినాలంటూ వార్నింగ్.. వీడియో