AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noida: బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఫ్లష్ ఆన్ చేయగా..

గ్రేటర్ నోయిడాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇంట్లోని టాయిలెట్ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన పేరెంట్స్‌ అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. కొన్ని జాతీయ మీడియాల నివేదికల నోయిడాలోని సెక్టార్ 36లో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది.

Noida: బాత్రూంలోకి వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్.. ఫ్లష్ ఆన్ చేయగా..
Western Commode
Anand T
|

Updated on: May 15, 2025 | 10:08 AM

Share

ఇంట్లోని వెస్టర్న్‌ టాయిలెట్‌ కమోడ్ పేలడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. కొన్ని జాతీయ మీడియాల కథనాల ప్రకారం..సెక్టార్ 36లో నివసిస్తున్న అషు అనే 22 ఏళ్ల కుర్రాడు తన ఇంట్లో ఉన్న బాత్‌రూమ్‌లో టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే బయటకు వచ్చేటప్పుడు అషు కమోడ్‌కు ఉన్న ఫ్లష్‌ను నొక్కాడు దీంతో ఒక్కసారిగా భారీ శబ్ధంలో ఆ కమోడ్ పేలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అషు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన అషు తండ్రి అతన్ని వెంటనే గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS) కులోని హాస్పిటల్‌కు తరలించాడు. అషును పరీక్షించిన వైద్యులు అతనికి 35 శాతం కాలిన గాయాలు అయినట్లు నిర్ధారించారు.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో బాత్రూంలో ఎటువంటి గ్యాడ్జెట్స్‌ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ లేవని అషు తండ్రి తెలిపారు.అయితే పేలుడు ఎలా సంభవించిందో తెలియట్లేదని అతని చెప్పుకొచ్చారు. అయితే, ప్రాథమిక అంచనాల ప్రకారం కమోడ్‌లో మీథేన్ వాయువు పేరుకుపోవడం వల్ల పేలుడు జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే డ్రైనెజీ ముసుకుపోవడం కారణంగా టాయిలెట్ కమోడ్‌లో గ్యాస్ వంటి వాయువులు పేరుకుపోయాయని.. ఫ్లస్‌ నొక్కినప్పుడు స్పార్క్‌ వంటిది ఏర్పడి పేలుడు సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది.

అయితే ఈ ఘటనపై స్పందించిన ఓ స్థానిక వ్యక్తి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ ప్రాంతంలో కొంత కాలంగా డ్రైనేజీ సమస్య ఉన్నట్టు తెలిపాడు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనేజీ పైపులు చాలా పాతవని.. అంతే కాకుండా వాటిని సంవత్సరాలుగా శుభ్రం కూడా చేయలేదని ఆరోపించాడు. ఈ కారణంగానే పైపులలో గ్యాస్ పేరుకుపోయి పేలుడుకు దారి తీసి ఉండొచ్చని అతని తన అభిప్రాయాన్ని చెప్పాడు.

అయితే, గ్రేటర్ నోయిడా అథారిటీ సీనియర్ మేనేజర్ ఏపీ వర్మ మాత్రం ఆ వ్యక్తి వ్యాఖ్యలను తోసిపుచ్చారు. తమ వ్యవస్థలు మంచి స్థితిలో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రైనెజీ వ్యవస్థ శుభ్రంగా ఉందని.. అంతే కాదు సాధారణంగా పనిచేస్తోంది అయన అన్నారు. ఈ ప్రమాదం ఇంటిట్లోని ఏదైనా అంతర్గత సమస్య వల్ల జరిగి ఉండొచ్చని ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!