Jaipur: మృత్యుంజయుడు ఈ బాలుడు.. 200 అడుగుల బోరుబావి నుంచి 7 గంటల్లోనే వెలికితీత..

జైపూర్‌లో శనివారం ఉదయం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన బాలుడిని రెస్క్యూ టీం సురక్షితంగా వెలికితీసింది. దాదాపు 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన బాలుడిని 7 గంటలపాటు అవిరామంగా శ్రమించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Jaipur: మృత్యుంజయుడు ఈ బాలుడు.. 200 అడుగుల బోరుబావి నుంచి 7 గంటల్లోనే వెలికితీత..
9 Year Old Boy Rescued From Borewell

Updated on: May 21, 2023 | 11:48 AM

జైపూర్‌లో శనివారం ఉదయం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిపోయిన బాలుడిని రెస్క్యూ టీం సురక్షితంగా వెలికితీసింది. దాదాపు 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన బాలుడిని 7 గంటలపాటు అవిరామంగా శ్రమించి కాపాడారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్‌ రాజధాని జైపూర్లోని భోజపురా గ్రామానికి చెందిన అక్షిత్‌ (9) నాలుగో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు వేసవి సెలవులు ఇవ్వడంతో భోజ్‌పురా గ్రామంలోని తన మేనమామ ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఆడుకుంటూ అక్షిత్‌ బోరుబావిలో పడిపోయాడు. దాదాపు 200 అడుగుల లోతు బోరుబావిలో పడిన బాలుడు 70 అడుగున వద్ద చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, సివిల్‌ డిఫెన్స్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా తొలి ప్రయత్నం విఫలమైంది. రాజస్థాన్‌ అగ్రికల్చర్‌ మంత్రి లాల్‌చంద్‌ కటారియా కూడా సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్వవేక్షించారు.

ఇవి కూడా చదవండి

రెస్క్యూ టీం తాళ్ల ద్వారా బాలుడికి ఆక్సిజన్‌, తాగునీరు, జ్యూస్‌లు సరఫరా చేశారు. బాలుడితో సంభాషిస్తూ ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత సమాంతరంగా గొయ్యి తవ్వి, 7 గంటలపాటు శ్రమించి బోరుబావి నుంచి బాలుడిని సురక్షితంగా బయటకు వెలికి తీశారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఉదయ్‌పూర్ సివిల్‌ డిఫెన్స్‌ డిప్యూటీ కంట్రోలర్‌ అమిత్‌ శర్మా మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.