ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 8వ వేతన సంఘానికి కేబినెట్‌ ఆమోదం!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్‌. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. 8వ వేతనసంఘం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 8వ వేతన సంఘానికి కేబినెట్‌ ఆమోదం!
Nirmala Sitharaman

Updated on: Oct 28, 2025 | 10:26 PM

కేంద్ర కేబినెట్‌ సమావేశంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రబీసీజన్‌లో రైతులకు రూ.38 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ ప్రకటించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు కేంద్రమంత్రి అశ్వినివైష్ణవ్‌. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. 8వ వేతనసంఘం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో 50 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.

18 నెలల్లో నివేదిక ఇవ్వాలని వేతనసంఘానికి డెడ్‌లైన్‌ విధించారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రంజన దేశాయ్‌ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు, మంత్రిత్వ విభాగాల సిబ్బందితో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. తరువాత కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. పోషక ఆధారిత సబ్సిడీలకు ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు అశ్విని వైష్ణవ్‌. రబీసీజన్‌లో రైతులకు రూ.38 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ ఇస్తునట్టు తెలిపారు. వ్యవసాయరంగంలో ఆధునిక పద్దతులకు ప్రోత్సాహం ఇస్తునట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..