Rahul Gandhi: ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు.. సీసీటీవీ ఫుటేజ్‌ మాయం.. ఈసీపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు..

ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని.. బీజేపీ కోసం ఈసీ ఓట్లను దొంగిలించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్‌పోల్స్‌కు , ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉందని.. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు.

Rahul Gandhi: ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు.. సీసీటీవీ ఫుటేజ్‌ మాయం.. ఈసీపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
Rahul Gandhi

Updated on: Aug 07, 2025 | 3:05 PM

ఈసీకి వ్యతిరేకంగా అణుబాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని.. బీజేపీ కోసం ఈసీ ఓట్లను దొంగిలించిందని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఎగ్జిట్‌పోల్స్‌కు , ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉందని.. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని తెలిపారు. ఢిల్లీలో గురువారం రాహుల్‌ గాంధీ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర , హర్యానా ఎన్నికల్లో పోలింగ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను మాయం చేశారని పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటల తరువాత భారీగా పోలింగ్‌ నమోదయ్యిందన్నారు. మహారాష్ట్రలో 40 లక్షల రహస్య ఓటర్లను చేర్పించారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్‌ డేటాను ఈసీ తమకు ఇవ్వడం లేదని.. ఓటర్ల జాబితా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఐదు వేర్వేరు తేదీల్లో ఈసీ ఓట్లను దొంగిలించిందన్నారు. కర్నాటకలోని మహదేవ్‌పూర్‌లో కూడా ఓట్లను దొంగిలించారన్నారు.

ఒకే ఓటరు పేరు నాలుగు పోలింగ్‌ బూత్‌ల్లో చేర్పించారని.. 11 వేల మంది పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేశారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నట్టు చూపించారని.. మహదేవ్‌పూర్‌లో 11965 మంది డూప్లికేట్‌ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఒకే ఓటరు నాలుగు రాష్ట్రాల్లో ఓటేశాడని.. ఒకే ఓటరుకు కర్నాటక, మహారాష్ట్ర, యూపీలో ఓటుహక్కు ఉందని.. తెలిపారు. మహదేవ్‌పూర్‌లో లక్షా 250 ఓట్లు దొంగిలించారు.. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..