8 Yrs of Modi Govt: ప్రధాని నరేంద్ర మోదీ (Narendr modi) నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి భారత్ డిజిటలైజేషన్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలతో డిజిటల్ పేమెంట్స్‌లో (Digital Payments) దూసుకుపోతోంది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌కు యూజర్లలో విస్త్రత అవగాహన పెరడగడంతో ఆన్‌లైన్ పేమెంట్స్ భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా బెర్లిన్‌లో పర్యటించిన సమయంలో ప్రధాని మోదీ దేశంలో జరగుతోన్న డిజిటల్ పేమెంట్స్ గురించి పలు విషయాలను పంచుకున్నారు.
2021లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం డిజిటల్ పేమెంట్స్‌లో భారత్‌లోనే 40 శాతం పేమెంట్స్ జరిగినట్లు ప్రధాని తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. పరిపాలనలో సాంకేతికత వినియోగం పెరగడం ద్వారా సరికొత్త భారత్ రూపుదిద్దుకుంటోందని మోదీ వివరించారు. దేశంలో డిజిటల్ విప్లవం తీసుకొచ్చిన మార్పుల గురించి మోదీ మాట్లాడుతూ.. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దాదాపు 10,000 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ సహాయం, స్కాలర్‌షాప్, రైతులకు చెల్లింపులు ఇలా అన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో సొమ్ము జమ అయ్యింది. గడిచిన 8 ఏళ్లలో భారత్‌లో డీబీటీ విధానంలో రూ. 22 లక్షలకు పైగా సొమ్మును ఖాతాల్లో జమచేశాము. దీని ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు డబ్బు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో రికార్డు స్థాయిలో విమానాశ్రయాలు నిర్మించాము. మెట్రో రైళ్ల నిర్మాణంతో పాటు, గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా ఇంటర్‌నెట్ అందుబాటులోకి తీసుకొచ్చా’మని మోదీ వివరించారు.
2014కి ముందు పనులు ఎప్పుడూ నిర్మాణం దశలోనే ఉండేవని, ఈ విషయంలో తాను ఎవ్వరినీ విమర్శించడం లేదని తెలిపిన ప్రధాని. కానీ రోడ్ల నిర్మాణం సరిగ్గా జరిగి ఉంటే ఆటోమెటిక్‌గా ఎలక్ట్రిసిటీ వచ్చేది, ప్రజలకు నీరు అందేది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే తాము పీఎమ్ గతిశక్తి తీసుకొచ్చామని మోదీ తమ ప్రభుత్వంలో సాధించిన విజయాల గురించి చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..