ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం.. బద్రీనాథ్ వెళ్తుండగా..

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌-బద్రీనాథ్ హైవేపై టూరిస్ట్‌ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

ఘోర రోడ్డుప్రమాదం.. టెంపో లోయలో పడి 8 మంది దుర్మరణం.. బద్రీనాథ్ వెళ్తుండగా..
Uttarakhand Accident
Follow us

|

Updated on: Jun 15, 2024 | 3:22 PM

ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రిషికేశ్‌-బద్రీనాథ్ హైవేపై టూరిస్ట్‌ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్‌కు వెళ్తున్న టెంపో ట్రావెలర్ రుద్రప్రయాగ్ సమీపంలోని కాలువలో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రావెలర్‌లో 23 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రయాణికులంతా నోయిడా నుంచి బయలుదేరినట్లు చెబుతున్నారు. శ్రీనగర్ వైపు నుంచి బద్రీనాథ్ వైపు వెళ్తున్న క్రమంలో రుద్రప్రయాగ్‌లో రోడ్డుపక్కన ఉన్న లోయలో టెంపో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, పోలీసు యంత్రాంగం రెస్క్యూ టీమ్ మరియు SDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి.

సీఎం పుష్కర్ సింగ్ ధామి దిగ్భ్రాంతి..

ఈ ఘోర ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా సంతాపం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని తరలించేందుకు అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ ఘటనపై విచారణకు సీఎం ధామి ఆదేశించారు. రుద్రప్రయాగ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని హెలికాప్టర్‌లో ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచనలు చేశారు. గాయపడిన వారికి అన్ని విధాలా సహాయం అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ఉత్తరాఖండ్ ప్రమాదంపై అమిత్ షా..

ఉత్తరాఖండ్ ప్రమాదంపై అమిత్ షా స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సానుభూతి తెలిపారు. స్థానిక అడ్మినిస్ట్రేషన్ మరియు SDRF బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయి. గాయపడిన వారికి అన్నివిధాలా సహాయం అందిస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.. అని అమిత్ షా ఎక్స్‌లో రాశారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం..

శనివారం 23 మందికి పైగా ఉన్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ కమాండెంట్ మణికాంత్ మిశ్రా తెలిపారు. . గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని SDRF అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
BH సిరిస్‌ కలిగిన నంబర్‌ ప్లేట్‌ ఎవరికి కేటాయిస్తారు?
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వచ్చే 2 రోజులు ఈ ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
విద్యుత్ కమిషన్‌ ఎంక్వైరీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
ముఖ సౌందర్యానికి బేకింగ్ సోడా వినియోగించవచ్చా?
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
ఈ చిన్న గింజలతో.. మొత్తం శరీరమే ఆరోగ్యంగా ఉంటుంది..
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
మీరు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నారా? అయితే మీకో షాకింగ్‌
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
అనంత్ అంబానీ పెళ్లి కోసం.. జక్కన్నకు ఇచ్చిన మాట తప్పిన మహేశ్ బాబు
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
ఇలాంటిలక్షణాలు మీలోకూడా కనిపిస్తున్నాయా? వెంటనే బ్రేక్‌ తీసుకోండి
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని
భయపెడితే భయపడే వాణ్ణికాదు, మంచితనానికి లొంగుతాః బాలినేని