కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!

|

Mar 22, 2021 | 1:57 PM

Holi Gift To Central Government Employees: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా మార్చి 28 లేదా..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!
Follow us on

Holi Gift To Central Government Employees: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా మార్చి 28 లేదా 29న హోళీ పండుగ జరగనున్న నేపధ్యంలో ఉద్యోగులకు ఫెస్టివల్ అడ్వాన్సు స్కీం అమలులోకి తీసుకొచ్చింది. 6వ వేతన సంఘం కింద ఈ స్కీం ద్వారా గతంలో ఉద్యోగులకు రూ. 4500 ఇవ్వగా.. తాజాగా ఆ మొత్తాన్ని కేంద్రం రూ. 10 వేలకు పెంచింది. ఈ డబ్బును నెలకు రూ. 1000 చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. ఈ నగదు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కింద తీసుకునేందుకు చివరి తేదీ మార్చి 31, 2021గా నిర్ణయించింది.

ఈ మొత్తానికి ఎలాంటి వడ్డీఉండదని.. 10 సులభ వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చునని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రీపెయిడ్ రూపే కార్డు రూపంలో ఈ రుణాన్ని ఇవ్వనున్నారు. ఉద్యోగులకు ముందస్తుగా పండుగుల అడ్వాన్స్‌ను ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉందని తెలిపింది.

అంతకుముందు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు ఊరట కలిగిస్తూ పెండింగ్‌లో ఉన్న మూడు విడతలు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ), డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్)ను జూలై నుండి పునరుద్ధరించాలని నిర్ణయించింది. కాగా, అవసరమున్న ఉద్యోగులు ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీంను వినియోగించుకోవాలని అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!