7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్… జూలై 1 నుంచి సవరించిన జీతాలు..

|

Jun 11, 2021 | 1:52 AM

ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచే చెల్లించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్... జూలై 1 నుంచి సవరించిన జీతాలు..
Follow us on

ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరగనున్న విషయం తెలిసిందే. జూలై 1 నుంచే చెల్లించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.  అయితే తాజాగా పెరగనున్న  డియర్నెస్ అలవెన్సు- డీఏ , డీఆర్ అలవెన్సులను.. గతంలో బకాయి ఉన్నప్పటి నుంచి కాకుండా, జూలై 1 నుంచే చెల్లించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

అయితే గతంతో పోలిస్తే కొంతవరకు పెరిగిన డీఏ, తాజా నిర్ణయం తరువాత 28 శాతానికి చేరుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన కాస్ట్ ఇండెక్షేషన్‌ జూన్ 30న నిర్వహించే అవకాశం ఉంది. సాధారణంగా ఇండెక్షేషన్ తరువాతే డీఏ పెరుగుదల అమల్లోకి వస్తుంది. దీని ఆధారంగా జులై 1 నుంచే డీఏ పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ వస్తోంది. 2019 జూలై నుంచి ఈ రేటు అమల్లో ఉంది. గత ఏదాది జనవరిలోనే దీన్ని సమీక్షించాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డీఏ పెంపుపై నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. దీనికి తోడు కరోనా కారణంగా గత ఏడాది జనవరి 1, జూలై 1, ఈ సంవత్సరం జనవరి 1న.. మొత్తం మూడు విడతల్లో చెల్లించాల్సిన డీఏను ఆపేసింది.

దీంతో మహమ్మారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డీఏ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. పెంచిన డీఏను గత వాయిదాలకు కలిపి చెల్లిస్తారని ఆశించారు.  ఈ మేరకు డీఏ పెంచితే, ప్రస్తుతం ఉన్న 17 శాతం నుంచి నుండి 28 శాతం వరకు కరవు భత్యం పెరగనుంది. దాదాపు 1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నిర్ణయం లబ్ది చేకూర్చనుంది.

ఇవి కూడా చదవండి: Congress Party: నా మృతదేహం కూడా బీజేపీలో చేర‌దు.. కాంగ్రెస్‌లో సమస్యలు అలాగే ఉన్నాయి..

దొంగలుగా మారిన ఖాకీలు.. తనిఖీల పేరుతో దోపిడీలు.. నిజం తెలిసిన అధికారులు షాక్..