7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరోసారి డీఏ పెరుగనుందా?..

| Edited By: Ravi Kiran

Aug 14, 2021 | 6:27 AM

7th Pay Commission: కోవిడ్ సంక్షోభం కారణంగా వ్యవస్థలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ప్రభుత్వాలు సైతం ఆర్థిక భారాలను..

7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మరోసారి డీఏ పెరుగనుందా?..
7th Pay Commission
Follow us on

7th Pay Commission: కోవిడ్ సంక్షోభం కారణంగా వ్యవస్థలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ప్రభుత్వాలు సైతం ఆర్థిక భారాలను మోయలేని స్థితి ఏర్పడింది. కాగా, కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌(డీఏ)ను పెంచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సాధారణంగా ఏడాదికి రెండుసార్లు డీఏ ని పెంచుతాయి. కానీ, గత సంవత్సరం కోవిడ్ పరిస్థితి కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల డీఏ అలవెన్స్‌ల పెంపును నిలిపివేసింది కేంద్రం. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణుగుతుండటంతో.. గత నెలలో ఉద్యోగుల డీఏ, డీఆర్ ను జులై 1వ తేదీ నుంచి 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ ప్రకటించారు. పెన్షనర్లకు ఈ కూడా ఈ పెంపును వర్తింపజేశారు. జనవరి, 2020 – జనవరి 2021 వరకు డీఏలో 11 శాతం పెరుగుదల ఉంది. అయితే, ప్రభుత్వం జనవరి-జూన్ 2021 కి సంబంధించి డీఏ ను పెంపును ప్రకటించలేదు.

7వ వేతన సంఘం కింద సాధారణంగా జనవరి, జులైలో ఈ భత్యాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది. ఆ కారణంగా.. 2021 జనవరి – జూన్ కాలానికి డీఏ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే, దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు ఈ సంవత్సరం మళ్లీ ప్రయోజనం పొందే ఛాన్స్ ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ప్రభుత్వం ఒకవేళ డియర్‌నెస్ అలవెన్స్‌ని మళ్లీ 3 శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 31 శాతానికి పెరుగుతుంది.

ఇదిలాఉంటే.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు డీఏని పెంచాయి. అస్సాం ప్రభుత్వం తమ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్‌ని ప్రస్తుతమున్న 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ గురువారం (ఆగస్టు 12) నిర్ణయం తీసుకుంది. డీఏ పెంచిన ఇతర రాష్ట్రాలలో ఉత్తర ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. ఈ ప్రభుత్వాలలో చాలా వరకు డీఏను 11 శాతం నుంచి 28 శాతానికి పెంచాయి. వాటిలో కొన్ని హెచ్ఆర్‌ఏ ప్రయోజనాలను కూడా పెంచాయి.

ఇకపోతే.. రక్షణ మంత్రిత్వ శాఖలోని దళాలకు వర్తించే విధంగానే హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సాయుధ దళాలకు కూడా అదే పెన్షన్ స్కీమ్‌ని విస్తరించాలని కేంద్రానికి ఆదేశించాలంటూ దాఖలైన పిల్‌ను విచారించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇలాంటి అనేక పిటిషన్లు ఇప్పటికే తీర్పు కోసం పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు బెంచ్ తెలిపింది.

Also read:

Apps for Farmers: ఈ మొబైల్ యాప్‌లతో రైతులకు ఎంతో మేలు.. ఇవి తెలిపే సమాచారం ద్వారానే రైతులకు..

Vijay-Dhoni: విజయ్‌ని కలిసిన క్రికెటర్ ధోనీ.. వివాదంగా మారిన పోస్టర్లు.. ఇంతకీ అందులో ఏముందంటే..

Andhra Pradesh: ఏళ్లుగా సహజీవనం చేశాడు.. ఆమె కూతురుపైనా కన్నేశాడు.. కాదన్నందుకు కడతేర్చాడు..