శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలుగా ప్రదాని మోడీ అభివర్ణించారు. ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోడీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు.
భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోడీ… అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ… దేశ ప్రజలకు ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన త్యాగధనులను ఇవాళ దేశం స్మరించుకుంటోంది. దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీరజవాన్లకు ప్రణామాలు అంటూ సెల్యూట్ చేశారు.
కరోనాపై పోరులో వైద్యులు, వైద్య సిబ్బంది చేసిన పోరాటం అసమానమని అభినందించారు. దేశీయంగా కరోనా టీకా తయారు చేసుకోవడం గర్వకారణమని, స్వయంగా టీకా అభివృద్ధి చేసుకొని ఉండకపోతే.. పోలియో తరహా పరిస్థితి ఏర్పడేదని అన్నారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి అని అన్నారు. పతకాలు సాధించిన వారికి దేశం యావత్తూ గౌరవం ప్రకటిస్తోందని పేర్కొన్నారు. వాళ్లు కేవలం పతకాలే సాధించలేదు.. నవయువతకు స్ఫూర్తిగా నిలిచారు.
దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి. కరోనా మహమ్మారి చుట్టుముట్టినపుడు టీకాల లభ్యతపై అనుమానం తలెత్తింది. భారత్ ప్రజలకు టీకాలు దొరుకుతాయా అనే అనుమానం వచ్చింది.
ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు.. వ్యాధి సంక్రమణ తక్కువే. సంక్రమణ తక్కువనేది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదు. మహమ్మారి కట్టడికి క్రమశిక్షణతో కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది.
మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించాం. కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిందామని మోడీ అన్నారు.
ఇవి కూడా చదవండి: Jio: 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్.. SMS పూర్తిగా ఫ్రీ.. ఈ జియో ప్లాన్‌లో మరిన్ని ప్రయోజనాలు..
Independence Day 2021 Live: దేశ విభజన గాయం నేటికీ వెంటాడుతోంది.. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ