ఎమ్మెల్యేనంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.. దర్జాగా సీట్లో కూర్చున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే..

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో భద్రతా వైఫల్యం బయటపడింది. 72 ఏళ్ల వృద్ధుడు.. తాను ఎమ్మెల్యేనంటూ దర్జాగా అసెంబ్లీ లోపలికి వెళ్లాడు.. అనంతరం అక్కడున్న వారిని పరిచయం చేసుకుంటూ వెళ్లి.. ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడు.

ఎమ్మెల్యేనంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.. దర్జాగా సీట్లో కూర్చున్నాడు.. చివరకు ఏం జరిగిందంటే..
Karnataka Assembly

Updated on: Jul 09, 2023 | 5:59 AM

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలో భద్రతా వైఫల్యం బయటపడింది. 72 ఏళ్ల వృద్ధుడు.. తాను ఎమ్మెల్యేనంటూ దర్జాగా అసెంబ్లీ లోపలికి వెళ్లాడు.. అనంతరం అక్కడున్న వారిని పరిచయం చేసుకుంటూ వెళ్లి.. ఎమ్మెల్యే సీట్లో కూర్చున్నాడు. అయితే, అతన్ని 15 నిమిషాలపాటు ఎవ్వరూ గుర్తించలేకపోయారు. చివరికి ఓ ఎమ్మెల్యే గుర్తించడంతో పోలీసులు అలర్టయ్యారు. అనంతరం వృద్దుడిని అరెస్ట్ చేశారు. వృద్దుడు చిత్రదుర్గకు చెందిన తిప్పేరుద్రప్పగా గుర్తించారు పోలీసులు. సాగర్ ఎమ్మెల్యే బేలూర్ గోపాలకృష్ణగా నటిస్తూ తిప్పేరుద్రప్ప అసెంబ్లీలో అడుగుపెట్టారు. తొలుత అసెంబ్లీ హాళ్లలో తిరిగిన వృద్దుడు, ఆ తర్వాత అసెంబ్లీలోని దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ సీటులో కూర్చున్నారు. సిబ్బంది మొదట అడ్డుకోగా.. తాను ఎమ్మెల్యేనంటూ లోపలికి వెళ్లారు.

అనంతరం డిప్యూటీ సీఎం సహా పలువురిని పలకరించి సీటులో కూర్చున్నారు. దర్జాగా కూర్చున్న అతడిని చూసి అనుమానించిన జేడీఎస్ ఎమ్మెల్యే శరణగౌడ.. పలువురు మార్షల్స్‌ కు, స్పీకర్‌కు సమాచారం అందించారు. ఆ వెంటనే మార్షల్స్‌ వచ్చి ఆయన్ని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా, తానూ ఎమ్మెల్యేనని, బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని మొండిపట్టు పట్టారు.

అయితే MLA అని రుజువు చేసే ఆధారాలు లేకపోవడంతో తిప్పేరుద్రను పోలీసులు అరెస్టు చేశారు. విజిటర్స్‌ పాస్‌తో లోపలికి ప్రవేశించిన వృద్ధుడు తాను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేనని చెప్పడంతో మార్షల్స్ కూడా నిజమేననుకుని లోపలికి విడిచిపెట్టారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు స్పీకర్ ఖాదర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

బడ్జెట్ సమావేశానికి హాజరు కావాలనే ఉద్దేశంతో విధానసౌధలోకి ప్రవేశించినట్లు తిప్పేరుద్రప్ప పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది విజిటర్స్ రిజిస్టర్‌లో తిప్పేరుద్రప్ప వివరాలను నమోదు చేసి ఎంట్రీ పాస్ జారీ చేశారని.. కానీ, తాను ఎమ్మెల్యేనని పట్టుబట్టి లోనికి వెళ్లినట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఆర్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ ఘటన కర్ణాటక విధాన్ సౌధలో భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలకు దారితీసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..