రిపబ్లిక్ దినోత్సవం నాటి అల్లర్ల సూత్రధారి పంజాబీ నటుడు దీప్ సిద్దుకి 7 రోజుల పోలీస్ కస్టడీ,

| Edited By: Anil kumar poka

Feb 09, 2021 | 7:02 PM

గతనెల 26  రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీ ఎర్రకోటలో అల్లర్లు, ఘర్షణలకు కారకుడని, రైతులను రెచ్ఛగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, సింగర్ దీప్ సిధ్ధుకి 7 రోజుల పోలీసు కస్టడీ విధించారు.

రిపబ్లిక్ దినోత్సవం నాటి అల్లర్ల సూత్రధారి పంజాబీ నటుడు దీప్ సిద్దుకి 7 రోజుల పోలీస్ కస్టడీ,
Follow us on

గతనెల 26  రిపబ్లిక్ దినోత్సవం రోజున ఢిల్లీ ఎర్రకోటలో అల్లర్లు, ఘర్షణలకు కారకుడని, రైతులను రెచ్ఛగొట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, సింగర్ దీప్ సిధ్ధుకి 7 రోజుల పోలీసు కస్టడీ విధించారు.  తన అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈయన పలు స్థలాలు మారుస్తూ వచ్చ్చాడని పోలీసులు తెలిపారు. ఈయనను ఢిల్లీ కి  సమీపంలో..హర్యానాకు  సుమారు 100 కి.మీ. దూరంలోని కర్నాల్ లో అరెస్టు చేశారు.  ఈయన అరెస్టుకు దోహదపడే సమాచారం ఇచ్ఛేవారికి పోలీసులు లక్ష రూపాయల రివార్డు ప్రకటించారు. ఇటీవలి  వరకు విదేశాల్లో ఉన్న సిద్దు కాలిఫోర్నియా లోని తన మహిళా స్నేహితురాలి ద్వారా తన వీడియోలను పంపే వాడని, వాటిని ఆమె అప్ లోడ్ చేసి రిలీజ్ చేసేదని ఇదివరకే వార్తలు వచ్చాయి.. ఆమె కూడా ఒక నటి అని తెలుస్తోంది. నిజానికి ఢిల్లీ అల్లర్ల కేసులో రైతు నాయకులు తనను ఇరికించారని, వారు దేశద్రోహులని సిద్దు తన వీడియోల్లో ఆరోపిస్తూ వచ్చ్చాడు. రైతుల ఆందోళన నుంచి తనను పక్కదారి పట్టించేందుకు వారు యత్నించారని కూడా పేర్కొన్నాడు.

అయితే రైతు నేతలు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.
Read More: పక్కా ప్రణాళికతోనే గల్వాన్‌లో ఘర్షణలకు దిగిన చైనా, అమెరికా నిఘా సంస్థ నివేదకలో సంచలన విషయాలు.

Read More :ఉత్తరాఖండ్ ఘటనలో నిరంతర సేవలను అందిస్తున్న రెస్క్యూ టీమ్ కు సంఘీభావం తెలుపుతున్న సినీ ప్రముఖులు