సూరత్, డిసెంబర్ 5: అతనెవరో ఈ ప్రపంచానికి తెలియదు కాని అతని మరణం మాత్రం పోలీసులకు అనేక ప్రశ్నలను మిగిల్చింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ.1.14 లక్షల నగదు అతని వద్ద లభ్యమైంది. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన ఆ వృద్ధుడు.. చికిత్స ప్రారంభించిన కాసేపటికే కన్నుమూశాడు. పోస్టుమార్టం నివేదికలో ‘ఆకలి’ అతని చావుకు కారణమని అధికారులు తెలిపారు. అంత డబ్బు ఉన్న ఆకలితో ఎందుకు చనిపోయాడు? అతనికి ఆ డబ్బు ఎలా వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు పోలీసుల బుర్రలను తొలుస్తున్నాయి. వల్సాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గాంధీ లైబ్రరీ సమీపంలోని రోడ్డు పక్కన గత రెండు రోజులుగా అదే స్థలంలో బిచ్చగాడు పడి ఉండటాన్ని ఓ దుకాణం యజమాని గమనించాడు. దీంతో అతను 108కి డయల్ చేసి ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించాడు. వృద్ధుడికి సృహరాగానే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భవేష్ పటేల్ అతని వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బిచ్చగాడు చనిపోయాడు. రోజుల తరబడి ఆకలితో అలమటించడం మూలంగా వృద్ధుడు మరణించినట్లు వల్సాద్ సివిల్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వ్యక్తి మృతితో అతని వద్ద ఉన్న రూ.1.14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భవేష్ పటేల్ మీడియాతో మాట్లాతుడూ.. చనిపోయిన వృద్ధుడు గుజరాతీ మాట్లాడుతున్నాడు. వల్సాద్‌లోని ధోబీ తలావ్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా ఎలాంటి చలనం కనిపించడం లేదని దుకాణదారుడు చెప్పాడు. సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అతని వద్ద రూ.1.14 లక్షల నగదు లభ్యమైంది. నగదులో 38 రూ. 500 నోట్లు, 83 రూ. 200 నోట్లు, రూ. 537 100 కరెన్సీ నోట్లు, రూ. 20, రూ. 10 యొక్క కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఈ నోట్లన్నీ చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి అతని స్వెటర్ జేబు, అతని ప్యాంటు పాకెట్స్‌లో ఉన్నాయి. వైద్యాధికారి ఎదుట ఈ నగదును వల్సాద్ పట్టణ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.
వల్సాద్ సివిల్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ కృష్ణ పటేల్ మాట్లాడుతూ.. వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు, అతను టీ అడిగాడు. అతను ఆకలితో ఉన్నాడని, అతని రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. సెలైన్ ఎక్కించి చికిత్స ప్రారంభించాం. అయితే గంట తర్వాత అతను మరణించాడు. గత రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆకలితో చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు ఆధారంగా తెలుస్తోందని తెలిపాడు. బిచ్చగాడు ఎవరనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. పోలీసులు అతని ఫోటోలు తీసి వివిధ ప్రాంతాలకు పంపించారు.
NO FAKE NO BOT
JUST ORIGINALడిజిటల్ రంగంలో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన #TV9Telugu pic.twitter.com/nBSqWBMn6R
— TV9 Telugu (@TV9Telugu) December 5, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.