Covid Antibodies: ముంబైలో పిల్లలపై సర్వే .. థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందటున్న నిపుణులు

Covid Antibodies: కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మరోవైపు ప్రభుత్వాలు వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే థర్డ్ వేవ్ త్వరలోనే రానుందని..

Covid Antibodies: ముంబైలో పిల్లలపై సర్వే .. థర్డ్ వేవ్ వచ్చే ఛాన్స్ ఉందటున్న నిపుణులు
Anti Bodies

Updated on: Jun 29, 2021 | 12:16 PM

Covid Antibodies: కరోనా సెకండ్ వేవ్ కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. మరోవైపు ప్రభుత్వాలు వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే థర్డ్ వేవ్ త్వరలోనే రానుందని.. ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపనున్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించి కోవిడ్ యాంటీ బాడీలు టెస్టులు చేస్తున్నారు. ఓ బృందం ముంబైలో సర్వే చేపట్టగా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.

ఇటీవల ముంబైలోని బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌, కస్తూర్బా మాలిక్యులార్ డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీల సంయుక్తంగా సర్వ్ చేపట్టరు, స్థానికంగా ఉన్న 6 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల నుంచి శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్ ను పరీక్షించగా ఎక్కువ మంది పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. గతంలో చేపట్టిన సీరో సర్వే కన్నా ఈ సర్వేలోనే పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు… కనుక కోవిడ్ మూడో వేవ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిల్లల్లో కోవిడ్ యాంటీ బాడీలు పెరగడం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు అంటున్నారు. అంటే వారికి కోవిడ్ ఎక్కువగా వస్తుందని స్పష్టమవుతుందని చెబుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: పుట్టిన ప్రతిజీవికి మరణం తప్పదంటూ ఆర్జీవీ ఫిలాసఫీ.. తనకు ఎలాంటి చావు కావాలో చెప్పిన వైనం