AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lucknow : హైవేపై తగలబడిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవదహనం!

ఉత్తర్‌ప్రదేశ్‌ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లక్నోలోని కిసాన్‌పాత్‌ వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం కాగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

lucknow : హైవేపై తగలబడిన ట్రావెల్స్‌ బస్సు.. ఐదుగురు సజీవదహనం!
Lucknow
Anand T
|

Updated on: May 15, 2025 | 12:48 PM

Share

ఓ స్లీపర్‌ బస్సులో మంటలు చెలరేగి ఐదుగురు ప్రయాణికులు సజీవదహనం అయిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఓ ట్రావెల్స్‌ బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుంది. లక్నోలోని కిసాన్‌పాత్‌ వద్దకు రాగానే ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల కారణంగా బస్సు డోర్స్‌ అన్ని లాక్‌ అయిపోయాయి. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ కండక్టర్ వెంటనే బస్సును పక్కకు ఆపి బస్సు అద్ధాలను ధ్వంసం చేసి కిందకు దూకారు.. అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఐదు మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారు, ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి ఉన్నారు.

ఇక బస్సులోంచి తప్పించుకున్న డ్రైవర్, కండక్టర్ మంటల్లో చిక్కుకున్న మిగతా ప్రయాణికులను  కాపాడారు. ప్రమాదంపై వెంటనే స్థానిక అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.

మంటలు చెలరేగిన తర్వాత కూడా బస్సు కిలోమీటర్ వరకు ప్రయాణిస్తూనే ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే బస్సులో మంటలకు చెలరేగడానికి గల కారణాలపై ఇప్పవరకు ఎలాంటి స్పష్టత రాలేదు.  బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేకపోవడం వల్లనే భారీగా ప్రాణనష్టం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
తిరుమల శ్రీవారికి 100 కోట్ల ఆస్తిని ఇచ్చేసిన టాలీవుడ్ నటి..
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
ఒక్క కార్డుతో బస్సులో రాయితీ, ట్రైన్స్‌లో బెర్త్.. ఎలా పొందాలంటే
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
హైదరాబాద్ చేరువలోనే వైజాగ్.. 3 గంటలే జర్నీ.. ఒక్కరోజు ట్రిప్‎కి..
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
ప్రతి నెలా రూ.16 వేల పెట్టుబడితో రూ.1 కోటి సొంతం చేసుకోవచ్చా..?
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించిన తలపొగరోడు..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
ఈ 5 రాశులవారికి పండుగలంటే పిచ్చి.. వారి ఎంజాయ్‎మెంట్..
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ
రేషన్ కార్డు ఉన్నవారికి భారీ గుడ్‌న్యూస్.. జనవరి నుంచి అవి ఫ్రీ