AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. LOC ప్రాంతాల భద్రతపై సమీక్ష!

భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. ఇటీవలి ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత రక్షణ మంత్రి జమ్మూ కశ్మీర్ పర్యటన ఇది మొదటిది. శ్రీనగర్‌లోని బాదం బాగ్ కంటోన్మెంట్‌కు వెళ్లి ఈరోజే ఢిల్లీకి తిరిగి వెళ్తారు. జమ్ము కశ్మీర్‌లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు.

జమ్మూ కశ్మీర్‌లో పర్యటిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. LOC ప్రాంతాల భద్రతపై సమీక్ష!
Rajnath Singh
Balaraju Goud
|

Updated on: May 15, 2025 | 1:08 PM

Share

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. గురువారం(మే 15) ఆయన బాదామి బాగ్ కంటోన్మెంట్ కు వెళతారు. జమ్ము కశ్మీర్‌లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన చర్యల గురించి సిబ్బందికి దిశానిర్దేశం చేసేందుకు జమ్ము కశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్‌లో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ కాశ్మీర్ లోయకు చేసిన మొదటి పర్యటన ఇది.

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్ముకశ్మీర్ పర్యటన చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. శ్రీనగర్ పర్యటన సందర్భంగా, రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. 15 కార్ప్స్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ సైనిక అధికారులతో చర్చలు జరుపుతారు. శ్రీనగర్‌లో తన కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి బయలుదేరుతారు.

జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లోని పాఠశాలలు మే 15న తిరిగి తెరవడం జరుగుతుందని జమ్మూలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. ఈ వార్త విద్యార్థులు, తల్లిదండ్రులకు ఉపశమనం కలిగించే విషయం. భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, జమ్మూలోని సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో మే 15 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజా మామూలు పరిస్థితులు నెలకొనడంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు విద్య శాఖ తెలిపింది.

అదేవిధంగా, రాజౌరి, పీరీ, కలకోటే, తన్మండి, మొగ్లా, కొట్రంక, ఖవాస్, లోయర్ హతల్, దర్హాల్ ప్రాంతాల్లో కూడా పాఠశాలలు చాలా రోజుల తర్వాత తెరుచుకున్నాయి. పూంచ్‌లోని సురాన్‌కోట్, బుఫ్లియాజ్‌లలో కూడా, పరిస్థితి మెరుగుపడిన తర్వాత మే 15 నుండి విద్యార్థులు పాఠశాలలకు వెళ్లగలిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
నెహ్రూను మించి మోదీ సక్సెస్‌కు కారణం ఇదే.. లెక్కలతో సహా చెప్పిన
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
మిక్సీ, రోలు లేకుండానే అంతే రుచిగా చేతితో చేసే దోసకాయ పచ్చడి..
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
Video: ఛీ, ఛీ.. వ్యూస్ కోసం టవల్ డాన్స్‌తో రెచ్చిపోయిన యువతి
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
‘దేశమే ప్రథమం’.. మోదీ హయాంలో సరికొత్త స్వర్ణయుగంః చంద్రబాబు
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
ఈ లక్కీ ప్లాంట్ ఎప్పటికీ పచ్చగా ఉండాలంటే మట్టిలో పెంచడం మంచిదా?
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్‌లో వాచ్‌మెన్‌.. ఇప్పుడు
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
కసితో రెచ్చిపోయిన సూర్య! ఇదేదో ముందే చేసుంటే..
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
వీక్‌డేస్‌లోనూ అదరగొట్టిన 'పెద్ది'.. 5 రోజుల కలెక్షన్ల వివరాలివే
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
సిబిల్ స్కోర్ లేకపోయినా క్రెడిట్ కార్డు పొందటం ఎలా..?
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే
అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టబోయాడు.. సీన్ కట్‌చేస్తే