Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం..

|

Apr 16, 2024 | 8:32 AM

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ఘోర ఘటన సోమవారం (ఏప్రిల్ 15) సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిగా.. దాదాపు 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా..

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. వంతెనపై నుంచి పడిపోయిన బస్సు! ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం..
Odisha Bus Accident
Follow us on

జాజ్‌పూర్, ఏప్రిల్ 16: ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబతి సమీపంలో జాతీయ రహదారి-16పై వెళ్తున్న బస్సు ఫ్లైఓవర్‌పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ఘోర ఘటన సోమవారం (ఏప్రిల్ 15) సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిగా.. దాదాపు 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు కటక్ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు వెళ్తుండగా జాతీయ రహదారి-16లోని బారాబతి వంతెనపై రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్‌ మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటీన కటక్‌లోని ఎస్‌సిబి మెడికల్ కాలేజీ అండ్‌ ఆసుపత్రికి, జాజ్‌పూర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు గమనించిన ఓ స్థానికుడు తెలిపాడు. సమీపంలోని బస్టాండ్ వద్ద బస్‌ కోసం ఎదురు చూస్తుండగా.. అటుగా వచ్చిన బస్సును డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం గమనించామని తెలిపాడు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ మద్యం సేవించి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.

ప్రమాద స్థలంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తాజా ప్రమాదంపై ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. జాజ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్, వైద్యుల బృందం, ఇతర జిల్లా పరిపాలన అధికారులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.