వామ్మో.. 40 మంది రెడ్‌లైట్ ఏరియా మహిళలకు ఒక్కడే భర్త.. ఎక్కడంటే

ప్రస్తుతం బిహార్ లో రెండోదశ కులగణన జరగుతోంది. అయితే ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న అధికారులు షాకైపోయిన ఘటన చోటుచేసుకుంది . ఒక్కరు కాదు ఇద్దరు కాదు. దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

వామ్మో.. 40 మంది రెడ్‌లైట్ ఏరియా మహిళలకు ఒక్కడే భర్త.. ఎక్కడంటే
Woman

Updated on: Apr 26, 2023 | 11:34 AM

ప్రస్తుతం బిహార్ లో రెండోదశ కులగణన జరగుతోంది. అయితే ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్న అధికారులు షాకైపోయిన ఘటన చోటుచేసుకుంది . ఒక్కరు కాదు ఇద్దరు కాదు. దాదాపు 40 మంది మహిళలు ఒకే పేరును తమ భర్తగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఈ కుల గణనలో భాగంగా.. కులం, విద్య, ఆర్థిక స్థితి, కుటుంబ స్థితిగతుల వంటి విషయాలు తెలుసుకునేందుకు ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. అర్వల్ జిల్లాలోని ఓ రెడ్‌లైట్ ఏరియాలో ఉంటున్న వారి వివరాలు సేకరించేందుకు సిబ్బంది అక్కడికి వెళ్లారు.

అయితే అక్కడ సుమారు 40 మంది మహిళలు తమ భర్త పేరు రూప్‌చంద్ అని చెప్పుకొచ్చారు. చాలామంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్‌చంద్ అని తెలిపారు. ఇది చూసిన అధికారులు కంగుతిన్నారు. ఆ తర్వాత ఇంతమంది ఒకే పేరు ఎందుకు చెబుతున్నారని ఆరాతీయగా.. అసలు విషయం బయటపడింది. అసలు రూప్‌చంద్ అనే వ్యక్తి లేడని తెలుసుకున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో డబ్బులని రూప్‌చంద్ గా భావిస్తారు. అందుకే అక్కడి మహిళలు ఆ పేరు పేరునే తమ భర్త పేరుగా స్వీకరించారు. మరికొంతమంది మహిళలు తమ తండ్రుల పేర్లు కూడా రూప్‌చంద్ అని నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కుల గణన కోసం బిహార్ ప్రభుత్వం రూ. 500 కోట్లు ఖరారు చేసింది. దాదాపు 17 అంశాలపైన ప్రభుత్వ అధికారులు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి