National: ఆరుగంటల పాటు బోరుబావిలో 4 ఏళ్ల కుర్రాడు.. చివరికి మృత్యుంజయుడిగా. వీడియో

|

Jul 23, 2023 | 9:41 PM

మృత్యుంజయుడంటే ఆ బాలుడే.. ఆరుగంటల పాటు బోరుబావిలో నరకయాతన అనుభవించాడు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి ఆ బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. బీహార్‌ లోని నలందా జిల్లా కులూ గ్రామంలో బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల శుభంకుమార్‌ను చాలా చాకచక్యంగా రక్షించారు. బిహార్‌లోని నలందా జిల్లా కులు గ్రామంలో బోరుబావిలో బాలుడు..

National: ఆరుగంటల పాటు బోరుబావిలో 4 ఏళ్ల కుర్రాడు.. చివరికి మృత్యుంజయుడిగా. వీడియో
Borewell
Follow us on

మృత్యుంజయుడంటే ఆ బాలుడే.. ఆరుగంటల పాటు బోరుబావిలో నరకయాతన అనుభవించాడు. సహాయక సిబ్బంది ఎంతో శ్రమించి ఆ బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. బీహార్‌ లోని నలందా జిల్లా కులూ గ్రామంలో బోరుబావిలో పడ్డ నాలుగేళ్ల శుభంకుమార్‌ను చాలా చాకచక్యంగా రక్షించారు. బిహార్‌లోని నలందా జిల్లా కులు గ్రామంలో బోరుబావిలో బాలుడు పడిపోయాడు. బోరుబావిలో పడ్డ బాలుడిని అతికష్టం మీద రక్షించారు. 6 గంటల పాటు శ్రమించిన తరువాత నాలుగేళ్ల శుభంకుమార్‌ను బయటకు తీసింది రెస్క్యూ టీమ్‌.

ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పొలం దగ్గర ఆడుకుంటూ శుభం బోరుబావిలో పడిపోయాడు. దీంతో వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శుభంకుమార్‌ 150 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. 40 అడుగుల లోతులో అతడు చిక్కుకున్నట్టు గుర్తించారు. బోరుబావి లోకి కెమెరాను పంపించారు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది. ఆక్సిజన్‌ కూడా నిరంతరం అందేలా చర్యలు తీసుకున్నారు. బోరుబావి నుంచి బయటకు తీసిన తరువాత శుభంకుమార్‌ను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

బోరుబావిలో శుభంకుమార్‌ కదలికలు స్పష్టంగా కనబడ్డాయి. బీహార్‌లో చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పెద్దల నిర్లక్ష్యం పిల్లల పాలిట శాపంగా మారుతున్నది. సాగునీటి కోసం బోర్లు వేస్తున్న రైతులు నీళ్లు పడకపోతే వాటిని అలాగే ఓపెన్‌గా వదిలేస్తున్నారు. దాంతో అభంశుభం తెలియని చిన్నారులు ఆడుకుంటూ వాటిలో పడిపోతున్నారు. శుభంకుమార్‌ను రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది జేహుక్‌ పద్దతిని ఉపయోగించారు. బోరుబావి లోకి తాడు వేసి, బాలుడి కాళ్లకు బిగించి బయటకు తీసుకొచ్చినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ అధికారులు వెల్లడించారు. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..