కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి.. నలుగురు మృతి

| Edited By:

Aug 23, 2019 | 1:40 PM

పశ్చిమబెంగాల్‌లోని కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని కచువాలో గల స్థానిక ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మరో 27మంది గాయపడ్డారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన సమయంలో ప్రహారి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నేషనల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా […]

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి.. నలుగురు మృతి
Follow us on

పశ్చిమబెంగాల్‌లోని కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని కచువాలో గల స్థానిక ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మరో 27మంది గాయపడ్డారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చిన సమయంలో ప్రహారి గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఆందోళనకు గురైన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నేషనల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు ఘటనపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున నష్టపరిహారం ప్రకటించి.. గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.50వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు.