Watch Video: రాత్రి రోడ్డుపై వెళ్తున్న వికలాంగ మహిళ.. సడెన్‌గా చుట్టుముట్టిన 4 బైకులు.. తర్వాత ఏం జరిగిందంటే!

ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో దారుణం వెలుగు చూసింది. 21 ఏళ్ల వికలాంగ మహిళపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల మహిళను వెంబడిస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు.

Watch Video: రాత్రి రోడ్డుపై వెళ్తున్న వికలాంగ మహిళ.. సడెన్‌గా చుట్టుముట్టిన 4 బైకులు.. తర్వాత ఏం జరిగిందంటే!
Balrampur Gang Assaulted

Updated on: Aug 13, 2025 | 4:46 PM

21 ఏళ్ల వికలాంగ మహిళలను కిడ్నాప్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో వెలుగుచూసింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఒక మహిళ తన మామయ్య ఇంటి నుండి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆమె రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అటుగా వచ్చిన కొందరు బైక్ రైడర్స్‌ ఆమెను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని, ఒక నిర్మాణుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) విశాల్ పాండే తెలిపారు.

ఆమెను బైకర్‌ వెంబడిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న పోలీసు సూపరింటెండెంట్ నివాసంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో రికార్డైనట్టు ఆయన తెలిపారు. ఈ ఫుటేజ్‌లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ మహిళ పరిగెడుతుండగా గుర్తుతెలియని నలుగురు బైకర్స్‌ ఆమెను వెంబడిస్తున్నట్టు కనిపిస్తోంది పోలీసులు తెలిపారు. అయితే ఆ మహిళ ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన ఆమె కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతకడం స్టార్ట్‌ చేశారు. చివరికి ఆమె ఒక పోలీసు పోస్టు సమీపంలోని పొదల్లో అపస్మారక స్థితిలో పడి ఉండడం గమనించారు. వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అయితే అక్కడ ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనై కేసు నయోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షలో ఆ మహిళపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయిందని ASP తెలిపారు.

వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.