గుండె పోటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు వయసు పడిన వారిలో మాత్రమే హృదయ సంబంధిత సమస్యలు కనిపించేవి. కానీ ప్రస్తుతం తక్కువ వయసున్న వారు కూడా హార్ట్ ఎటాక్‌తో మరణిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా తదనంతర పరిస్థితుల్లో గుండె పోటు బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట గుండెపోటుకు సంబంధించిన మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి.
తాజాగా ఇలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గుండె పోటు కారణంగా 36 ఏళ్ల ఆర్మీ జవాన్ క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మధ్యప్రదేశ్‌లోని టికామ్‌గఢ్ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన మార్గువ గ్రామంలో ఆదివారం జరిగింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు.
36 ఏళ్ల ఆర్మీ జవాన్‌ను లాన్స్ నాయక్ వినోద్‌గా గుర్తించారు. ఈయన ఆదివారం మధ్యాహ్నం పొరుగు గ్రామమైన బిరౌలో క్రికెట్ ఆడడానికి వెళ్లాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందంటూ చెప్పాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉంటే వినోద్ ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవుల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. ఫిబ్రవరి మొదటి వారంలో తిరిగి విధుల్లో చేరాల్సి ఉండగా ఇలా జరిగిందని ఆయన సోదరుడు తెలిపారు.
* చిన్న పనులకే విపరీతమైన అలసటగా ఉన్నా, ఉన్నపలంగా చమటలు వస్తున్నా సైలంట్ హార్ట్‌ఎటాక్‌కు కారణంగా మారుతుందని చెబుతున్నారు.
* శ్వాసతీసుకోవడంలో ఉన్నపలంగా ఇబ్బందికలగడం, ఆక్సిజన్ కొరత ఏర్పడినట్లు అనిపించడం. చేతులు, మెడ, దవడ లేదా వీపులో, ఛాతీలో నొప్పి ఉంటే కూడా గుండెపోటుకు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.
* నిత్యం తలనొప్పి తలతిరిగిన భావనం కలగడం, నిరంతరకం వికారం, రక్తపోటు పెరగడం శ్రమతో సంబంధం లేకుండా చెమటలు రావడం వంటివి గుండెపోటు ముందస్తు లక్షణంగా భావించాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..