Valentine’s Day: ఉప్పొంగిన ప్రేమ.. వాలెంటైన్స్ డే వీక్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్‌లు ఆర్డర్స్

|

Feb 14, 2024 | 12:08 PM

ఇవాళే ప్రేమికుల రోజు. ఇప్పటికే ప్రేమ జంటలు ప్రత్యేకమైన డేను సెలబ్రేట్ చేసుకోవడానికి వారంరోజులుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కొందరు డిన్నర్ డేట్, మరికొందరు లాంగ్ వెకేషన్ లాంటివి ప్లాన్ చేసుకొని సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు.

Valentines Day: ఉప్పొంగిన ప్రేమ.. వాలెంటైన్స్ డే వీక్‌లో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్‌లు ఆర్డర్స్
Valentine's Day Gifts
Follow us on

ఇవాళే ప్రేమికుల రోజు. ఇప్పటికే ప్రేమ జంటలు ప్రత్యేకమైన డేను సెలబ్రేట్ చేసుకోవడానికి వారంరోజులుగా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. కొందరు డిన్నర్ డేట్, మరికొందరు లాంగ్ వెకేషన్ లాంటివి ప్లాన్ చేసుకొని సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. అయితే లవర్స్ డే అనగానే చాలామందికి ముందుకు గుర్తుకు వచ్చేది గులాబీ పూలు, చాక్లెట్స్. అందుకే ప్రేమికులు ఈసారి రెచ్చిపోయి రోజా పూలను, చాకెట్లపై ఇష్టం పెంచుకొని అత్యధిక సంఖ్యలో డెలివరీ పెట్టుకున్నారు.

“వాలెంటైన్స్ వీక్” సందర్భంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో వీటి అమ్మకాలు బాగా పెరిగాయి. యువ జంటలు గులాబీలు, చాక్లెట్లు, శృంగార బహుమతులపై మనసు పారేసుకున్నారు. ఫిబ్రవరి 14 ప్రపంచవ్యాప్తంగా అధికారిక వాలెంటైన్స్ డేగా ఉన్నప్పటికీ, మనదేశ ప్రేమికులు ముందుగానే సెలబ్రేషన్స్ కు సిద్ధమయ్యారు. 7వ తేదీన గులాబీలను బహుమతిగా, 9వ తేదీన చాక్లెట్‌లు, 10వ తేదీన టెడ్డీ బేర్‌లను బహుమతులుగా ఇచ్చి తమ భాగస్వామిని ఆశ్చర్యపర్చారు.

ప్రేమికులు ఊహించనివిధంగా గిఫ్టులు కొన్నారు. వారంలో నిమిషానికి 350 గులాబీలు, 406 చాక్లెట్లు కొనుగోలు చేయడంతో రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ Zomato CEO అల్బిందర్ ధిండా  రియాక్ట్ అవుతూ ఫిబ్రవరి 9వ తేదీన నిమిషానికి 406 చాక్లెట్‌లను పంపిణీ చేశామని ట్వీట్ చేశారు. వాలెంటైన్స్ డేకి ముందు నిమిషానికి 350 గులాబీలను అందజేస్తూ కొత్త రికార్డును నెలకొల్పింది.

అంతే కాదు, వాలెంటైన్స్ డే రోజున ఆన్‌లైన్ కేక్ ఆర్డర్‌ల పెరుగుదల సంఖ్య పెరుగుతోంది. స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ ట్వీట్ చేస్తూ “గత సాయంత్రం దేశవ్యాప్తంగా కేక్‌ల కోసం ఆర్డర్లు పెరగడం ప్రారంభించాయి. గరిష్టంగా రాత్రి 10 గంటలకు ఆర్డర్లు చేయబడ్డాయి” అని ఆయన తెలిపారు.